నిజానికి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో సంకల్ప సభను నిర్వహించేందుకు జనసేన లీగల్ టీమ్ అన్ని లైన్లూ క్లియర్ చేసుకుంది. సుమారు రెండు వేల మంది ముఖ్య ప్రతినిధులతో ఇండోర్ మీటింగ్ పెట్టాలనుకున్నప్పటికీ.. ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ సమస్యలు, శాంతిభద్రతల కారణాలను సాకుగా చూపిస్తూ సైబరాబాద్ పోలీసులు చివరి నిమిషంలో నో చెప్పారు. ఈ ఆకస్మిక తిరస్కరణతో జనసేన శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.
సాధారణంగా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో జరిగే ప్రెస్మీట్‌కు పోలీసుల అనుమతితో పని లేకపోయినా, అసలు జూబ్లీహిల్స్ నివాసం వద్ద పోలీసులు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నివాస పరిసర ప్రాంతాల్లో హడావుడి పెరిగింది. అనుమతి నిరాకరణ వార్త తెలియగానే జనసేన అగ్రనేతలు, కార్యకర్తలు భారీగా జూబ్లీహిల్స్‌కు చేరుకుంటున్నారు. పోలీసులు సభను అడ్డుకున్నా, ప్రెస్మీట్ ద్వారా పవన్ కల్యాణ్ చెప్పాలనుకున్న పొలిటికల్ మెసేజ్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆయన ఏ రేంజ్‌లో ధ్వజమెత్తబోతున్నారు? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. భద్రతా కారణాల పేరుతో ఈ ప్రెస్మీట్‌పై కూడా ఆంక్షలు విధిస్తే గనుక, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.