Wed. Jan 21st, 2026

    TDP: ఏపీ రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో గెలవడం ద్వారా మరల ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకుంది. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో 23 స్థానాలే వచ్చిన కూడా ఈ నాలుగేళ్ళలో జగన్ పాలనపై ప్రజలలో ఎంత వ్యతిరేకత పెరిగింది అనేది అందరికి తెలిసిందే. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి అనేది ఏపీలో జరగడం లేదు. అయితే చంద్రబాబు  ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలనుకున్న అమరావతిని కూడా మూడు రాజధానుల అజెండాతో వైసీపీ పక్కన పెట్టింది.

    ఇక రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటికి ఏపీ ఉంది. ఇది ప్రజలలో వైసీపీపై వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యింది. అలాగే చంద్రబాబు హయాంలో పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉండేవి. తన అడ్మినిస్ట్రేట్ స్కిల్ తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో సాంకేతిక విజ్ఞానంలో ముందుకి వెళ్ళేలా చేసారు. చంద్రబాబు వేసిన పునాదుల మీద ఈ రోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి విస్వనగరంగా మారింది. ఇక అమరావతిని కూడా చంద్రబాబు అలాగే అభివృద్ధి చేయలని అనుకున్నారు.

    TDP president Chandrababu Naidu welcomes Rajinikanth's decision to launch  party - The Economic Times

    అయితే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలలోకి వెళ్ళిన జగన్ కి సానుభూతితో ప్రజలు పట్టం కట్టారు. అయితే ఈ నాలుగేళ్లలో జగన్ పాలనపై విసిగిపోయిన ప్రజలు మరల చంద్రబాబు అనుభవం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అనేది తాజాగా జరిగిన పట్టభద్రుల ఎన్నికలలో స్పష్టంగా తెలిసింది. రానున్న రోజుల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. భారీ మెజారిటీతో టీడీపీ అధికారంలోకి తెచ్చే దిశగా చంద్రబాబు వేస్తున్న వ్యూహాత్మక ఎత్తులలో జగన్ కి అప్పుడే టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఎమ్మెల్యేలని బుజ్జగించె ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.