TDP: ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలైన అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష తెలుగుదేశం 2024 ఎన్నికల లక్ష్యంగా పోటాపోటీగా వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మూడవ ప్రత్యమ్నయంలో ఉన్న జనసేన మాత్రం కేవలం తమకు బలం ఉన్న నియోజకవర్గాలలోని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ అక్కడ అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ వైసిపి వై నాట్ 175 అంటూ క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి తమ వ్యూహాలతో వెళ్తుంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రోజురోజుకి తమ బలం పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.
ఓవైపు చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు, మరోవైపు నారా లోకేష్ ఇవ్వగలం ఆ పార్టీకి ప్రచారం తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే జనసేన పార్టీ కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతుండడం తెలుగుదేశానికి అనుకూలించే అంశం అని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పొత్తులపై చర్చించినట్లుగా తెలుస్తుంది. సమావేశం అనంతరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త నినాదం అందుకున్నారు. వైసిపి తరహాలోనే వై నాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో 175 స్థానాల్లో గెలుస్తామని ధీమాతో చంద్రబాబు ఉన్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ కూడా వీలైనంత వేగంగా సినిమాలను ముగించుకొని ప్రజాసేత్రంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. వారాహి యాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు అన్ని నియోజకవర్గాలలో తమ బలం పెంచుకొనే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అదే సమయంలో పొత్తులపై కూడా ఒక స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి జనసేన అధినేత ఇచ్చిన బలంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వై నాట్ 175 నినాదం అందుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.