AP Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయంగా బలమైన నాయకుడుగా ఉన్నా కూడా ఇంకా బలమైన పార్టీగా జనసేనని తయారు చేసి సింగిల్ గా పోటీ చేసే స్థాయికి తీసుకురాలేదని చెప్పాలి. ప్రస్తుతం ప్రజలు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్న కూడా వారు ఎంత వరకు జనసేనకి ఓటుబ్యాంకుగా మారుతారు అనే సందేహం జనసేననిలో ఉంది. అందుకే ఓటరిగా అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తానని గట్టిగా చెప్పలేకపోతున్నారు. పార్టీ సభలలో కూడా ఒంటరిగా పోటీ చేసి మరల రిస్క్ చేయలేను అని పవన్ కళ్యాణ్ తెగేసి చెబుతున్నారు. ప్రయోగాల జోలికి పోను అని పదే పదే చెబుతున్నారు.
దీని ద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నాడు అనే అభిప్రాయానికి ఆ పార్టీ నాయకులు వచ్చేసారు. దీంతో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ఆశపడ్డ తెదేపా నాయకులు ఇప్పుడు కొద్దిగా టెక్కు చేస్తున్నారనే ప్రచారం నడుస్తుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలలో గెలవడానికి కూడా వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడానికి కారణం అయ్యిందనే మాట వినిపిస్తుంది. ఒంటరిగా పోటీ చేసిన గెలుస్తామనే ధీమా ఆ పార్టీ నాయకులకి వచ్చిందనే ప్రచారం నడుస్తుంది. ఈ నేపధ్యంలో జనసేనకి మనతో కలిస్తేనే బ్రతుకు, లేదంటే ఆ పార్టీ షట్టర్ క్లోజ్ చేసుకోవాల్సిందే అనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
20 సీట్లకి మించి ఇచ్చేది లేదు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు గాని, ఇక లోకేష్ గాని క్యాడర్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ వ్యవహారం జనసైనికులకి కోపం తెప్పిస్తుంది అనే మాట వినిపిస్తుంది. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి, లేదంటే ఒంటరిగా పోటీ చేయాలని జనసేనానికి సలహాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తమ డిమాండ్స్ కి టీడీపీ ఒప్పుకుంటేనే పొత్తు అనే విధంగా ఉన్నారు. ఈ ఒక వేళ పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకుంటే మాత్రం టీడీపీ దారుణంగా నష్టపోతుంది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.