Categories: LatestNewsPolitics

TDP: పవన్ కళ్యాణ్ కి క్రెడిట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేదా?

TDP:  రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతాయి అనేది ఎవరూ చెప్పలేరు. అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలలో వారు ముందుకి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో బలాబలాలని అంచనా వేసుకుంటూ రాజకీయాలు చేస్తూ ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనసేనాని బలం ఏపీలో రోజురోజుకి పెరుగుతుంది. దీనిని గ్రహించిన వైసీపీ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తుంది.

అతని ఇమేజ్ ని ఎలా అయిన తగ్గించాలని చూస్తుంది. అయితే అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ఎంతగా దాడి చేస్తే ప్రజలలో అతనిపై ఆదరణ అంతగా పెరుగుతుంది. ఇది జనసేన ఆవిర్భావ సభతో తేటతెల్లం అయ్యింది. అయితే ఈ సభ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా వైసీపీ ఏదైతే జరగకూడదని అనుకుంటుందో  అది జరుగుతుంది అని చెప్పారు. అలాగే జనసైనికులు కోరుకున్నది కూడా జరుగుతుంది అని స్పష్టం చేశారు. అయితే జనసేనాని ముఖ్యమంత్రి పీఠంపైన గురి పెట్టాడని టీడీపీ కూడా గ్రహించింది. ఈ నేపధ్యంలోనే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా ద్వారా తన పార్టీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తుంది.

అలాగేఅనుకూల మీడియా చానల్స్ తో కూడా తప్పుడు ప్రచారం చేయిస్తుంది. పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తుందని పవన్ కూడా గ్రహించారు. ఇదిలా ఉంటే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇది కొంత వరకు ప్రభావం చూపించింది. అయితే ఈ గెలుపు తమ బలంతోనే వచ్చింది అని ఇప్పుడు టీడీపీ భావిస్తుంది.

ఈ నేపధ్యంలోనే తాము ఒంటరిగా పోటీ చేసిన అధికారంలోకి వస్తాం అనే సందేశాలు జనసేనకి ఇస్తుంది. మీ పార్టీ మనుగడ సాగించాలంటే మేము ఇచ్చినన్ని సీట్లు తీసుకోవాలని కండిషన్స్  పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ వాపుని చూసి గెలుపు అనుకోని పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకుంటే ఆ పార్టీకే నష్టం అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ఎలాతారు అనేది ఇప్పుడు చూడాలి.

Varalakshmi

Recent Posts

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

2 days ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

2 days ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 days ago

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

4 days ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

6 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

7 days ago

This website uses cookies.