TDP: రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతాయి అనేది ఎవరూ చెప్పలేరు. అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలలో వారు ముందుకి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో బలాబలాలని అంచనా వేసుకుంటూ రాజకీయాలు చేస్తూ ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనసేనాని బలం ఏపీలో రోజురోజుకి పెరుగుతుంది. దీనిని గ్రహించిన వైసీపీ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తుంది.
అతని ఇమేజ్ ని ఎలా అయిన తగ్గించాలని చూస్తుంది. అయితే అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ఎంతగా దాడి చేస్తే ప్రజలలో అతనిపై ఆదరణ అంతగా పెరుగుతుంది. ఇది జనసేన ఆవిర్భావ సభతో తేటతెల్లం అయ్యింది. అయితే ఈ సభ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా వైసీపీ ఏదైతే జరగకూడదని అనుకుంటుందో అది జరుగుతుంది అని చెప్పారు. అలాగే జనసైనికులు కోరుకున్నది కూడా జరుగుతుంది అని స్పష్టం చేశారు. అయితే జనసేనాని ముఖ్యమంత్రి పీఠంపైన గురి పెట్టాడని టీడీపీ కూడా గ్రహించింది. ఈ నేపధ్యంలోనే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా ద్వారా తన పార్టీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తుంది.
అలాగేఅనుకూల మీడియా చానల్స్ తో కూడా తప్పుడు ప్రచారం చేయిస్తుంది. పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తుందని పవన్ కూడా గ్రహించారు. ఇదిలా ఉంటే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇది కొంత వరకు ప్రభావం చూపించింది. అయితే ఈ గెలుపు తమ బలంతోనే వచ్చింది అని ఇప్పుడు టీడీపీ భావిస్తుంది.
ఈ నేపధ్యంలోనే తాము ఒంటరిగా పోటీ చేసిన అధికారంలోకి వస్తాం అనే సందేశాలు జనసేనకి ఇస్తుంది. మీ పార్టీ మనుగడ సాగించాలంటే మేము ఇచ్చినన్ని సీట్లు తీసుకోవాలని కండిషన్స్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ వాపుని చూసి గెలుపు అనుకోని పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకుంటే ఆ పార్టీకే నష్టం అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ఎలాతారు అనేది ఇప్పుడు చూడాలి.