TDP Manifesto: గత ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం అయిన వాటిలో నవరత్నాల మేనిఫెస్టో కూడా ఒకటి. నవరత్నాలు పేరుతో ఉచితంగా డబ్బులు పంపిణీ కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. పథకం పేరుతో ప్రతి మహిళ ఖాతాలో ఏడాదికి ఇంత చొప్పున అని డబ్బులు జమ చేయడమే వైసీపీ పథకాలు. అయితే ఈ పథకాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వారి భావన, అయితే ఇచ్చిన ఇంత చేతిలో పెట్టి అంత వెనక్కి లాక్కున్తున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే మహానాడు వేదికగా రాబోయే ఎన్నికల మేనిఫెస్టోని టీడీపీ ప్రకటించింది.
ఇందులో కూడా మహిళలకి పెద్ద పీట వేస్తూ పథకాలని టీడీపీ అధిష్టానం సిద్ధం చేయడం విశేషం. అమ్మకు వందనం పేరుతో చదువుకుంటున్న పిల్లలు ఉన్న మహిళల ఖాతాలలో ఏడాదికి 15000 వేస్తానని ప్రకటించారు. అలాగే ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ లు, స్థానిక సంస్థలలో మహిళలకి పెద్ద పీట, నిరుద్యోగులకి నెలకి 3000 భ్రుతి, ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, రైతన్నకి ఏడాదికి 20000, జిల్లా పరిధిలో మహిళలకి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం, బీసీల రక్షణకి ప్రత్యేక చట్టం, పేదలని ధనికులుగా మార్చేందుకు పూర్ టూ రిచ్ అంటూ పథకాలని చంద్రబాబు ప్రకటించారు. వీటిలో మెజారిటీ మహిళలకి లబ్ది చేకూర్చేవి కావడం విశేషం.
అలాగే రైతన్నలకి ఆర్ధిక భరోసాగా 20 వేలు ఇస్తానని చెప్పడం కూడా మంచి విషయం అనే మాట వినిపిస్తోంది. మొదటి విడత మేనిఫెస్టోలో భాగంగానే ఇవన్ని చంద్రబాబు ఎనౌన్స్ చేశారు. ఇక ఎన్నికల ముందు మరిన్ని సంక్షేమ పథకాలని చేర్చి మేనిఫెస్టో సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ కి పట్టం కట్టిన బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం ఉండటం ఆసక్తికర విషయం. ఇక ఈ పథకాలతోనే రానున్న రోజుల్లో టీడీపీ ప్రచారం ఉంటుంది. దీనిపై వైసీపీ కూడా ఎదురుదాడి చేసి విమర్శలు మొదలు పెట్టె అవకాశం ఉంది.భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదంతో ఈ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించడం విశేషం.