AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మొదటి మేనిఫెస్టోని మహానాడు వేదికగా రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో మహిళలకి పెద్దపీట వేస్తూ పథకాలని ఎనౌన్స్ చేసింది. అలాగే ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ ఇచ్చింది. దాంతో పాటు నిరుద్యోగ భ్రుతి, అలాగే రైతు భరోసా పెంపు వంటి కీలక హామీలు ప్రకటించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నేరుగా మేనిఫెస్టో హామీలని ఎనౌన్స్ చేశారు. ఇక ఈ మేనిఫెస్టోపై ఇప్పుడు వైసీపీ తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. మేనిఫెస్టోలో హామీలు అన్ని వైసీపీ నుంచి కాపీ కొట్టినవే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు.
అలాగే టీడీపీ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం అంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అందులో టీడీపీ ఒక్కటి కూడా అమలు చేయదని విమర్శలు చేశారు. అలాగే చంద్రబాబు హామీలు అన్ని బూటకం అంటూ విమర్శించారు. మరోవైపు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కూడా టీడీపీ మేనిఫెస్టోపై ట్రోల్స్ చేస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి కూడా దీనిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. మొదటి మేనిఫెస్టోకి వైసీపీ నేతలకి భయం పట్టుకుందని విమర్శలు చేస్తున్నారు.
వైసీపీ నేతలు పిచ్చికుక్కలు అంటూ బుద్దా వెంకన్న లాంటి వారు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ విముక్తితోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అవుతుందని అంటున్నారు. కచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు వైసీపీ అరాచక పాలనకి గట్టిగా బుద్ధి చేబుతారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మాత్రం వైసీపీ నేతలకి మంట పుట్టిస్తోంది అనే మాట వినిపిస్తోంది.