AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలు మూడు కూడా రానున్న ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహాలు వేసుకుంటూ వెళ్తున్నారు. టీడీపీ ఇప్పటికే జనంలోకి వెళ్ళింది. ఇక వైసీపీ సంక్షేమ పథకాలని నమ్ముకుంటుంది. అలాగే మార్చి 18 నుంచి ప్రజలలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. సంక్షేమ పథకాలే తమని మళ్ళీ గెలిపిస్తాయని వైఎస్ జగన్ నమ్ముతున్నారు. అయితే `ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఈ సారి అధికారం తమదే అని టీడీపీ భావిస్తుంది. ఇక ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్న నేపధ్యంలో కచ్చితంగా తమకి బలమైన స్థానాలు లభిస్తాయని జనసేన భావిస్తుంది.
ఇలా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆత్మసాక్షి సర్వేతో ఏపీలో టీడీపీ వచ్చే ఎన్నికలలో అత్యధిక స్థానాలలో గెలిచి మొదటిస్థానంలో ఉంటుందని పేర్కొంది. అలాగే వైసీపీకి 63 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక జనసేన 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపారు. అయితే జనసేన బలం ఈ సారి భాగా పెరిగిందని, కావాలని చూపించే ప్రయత్నం చేయడం లేదని ఆ పార్టీ నాయకుల మాట. ఇదిలా ఉంటే జనసేన, టీడీపీ వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాయని అందరూ భావిస్తున్నారు.
ఇక జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే కచ్చితంగా 130 స్థానాల వరకు గెలుచుకుంటుంది అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జోష్యం చెప్పారు. ఆత్మసాక్షి సర్వే చెప్పిన 63 స్థానాలలో కూడా మా పార్టీ గెలిచే అవకాశం లేదని 20, 30 స్థానాలకి పరిమితం అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఇక జనసేన కూడా పొత్తులో భాగంగా టీడీపీని 50 స్థానాలు అడుగుతుంది. అయితే ఆ పార్టీ 35 స్థానాలు ఇవ్వడానికి ఫైనల్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది.