TDP: ఏపీ రాజకీయాలలో 2024ఎన్నికలలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతాను అంటూ చంద్రబాబు చాలెంజ్ కూడా చేశారు. ఈ నేపధ్యంలో ఎన్నడూ లేనంత అగ్రెసివ్ గా చంద్రబాబు ఎన్నికలలో గెలుపు కోసం పని చేస్తున్నారు. వైసీపీ వైఫల్యాలని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళి వారిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ కూడా తన వ్యూహాలని అమలు చేసుకుంటూ ప్రజలలోకి వెళ్తుంది. అయితే బాబు యాక్టివ్ పోలిటిక్స్ చేస్తూ జగన్ సౌండ్ లేకుండా చేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది.
)
ఇక ఈ సారి డిసెంబర్ లోపే ఎన్నికలు వస్తాయని, వైసీపీ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అంచనా వేశారంటే అది తప్పయ్యే అవకాశాలు లేవు. ఈ నేపధ్యం ముందస్తు ఎన్నికలు వస్తాయని డిసైడ్ అయిన చంద్రబాబు క్యాడర్ ని కూడా ఆ దిశగా సిద్ధం చేస్తున్నారు. ప్రజలలోకి వెళ్లి బలంగా పని చేయాలని సూచిస్తున్నారు. పనిలో పనిగా ఓ వైపు నారా లోకేష్ తాను పర్యటిస్తున్న నియోజకవర్గాలలో టీడీపీ నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్నారు.

మరో వైపు చంద్రబాబు జోనల్ సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్ధులని ఎంపిక చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారిని గ్రౌండ్ లెవల్ లోకి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉంటుందని భావిస్తున్న, వారు అడిగే నియోజకవర్గాలని మినహాయించి మిగిలిన చోట్ల అభ్యర్ధులని ఎంపిక చేసుకుంటూ చంద్రబాబు దూసుకుపోతూ ఉన్నారు. ఇలా ఇప్పటి నుంచి అభ్యర్ధులని ఖరారు చేయడం ద్వారా రానున్న ఎన్నికల సమయానికి పార్టీలో అసంతృప్తి లేకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

