Wed. Jan 21st, 2026

    TDP: మై విలేజ్ షోతో పాపులర్ అయిన గంగవ్వ అందరికి సుపరిచితమే. లేటు వయస్సులో వచ్చి సెలబ్రిటీ ఇమేజ్ ని గంగవ్వ భాగా ఆశ్వాదిస్తోంది. ఇక గంగవ్వకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం విపరీతంగా వాడేసుకుంటున్నారు. అలాగే టీవీ ఛానల్స్ కూడా వారి రేటింగ్స్ కోసం గంగవ్వ ఇమేజ్ ని వాడుకుంటున్నాయి. ఇదే అదునుగా ఆమెని తెలియకుండానే రాజకీయ పరమైన ప్రచారాల్లో కూడా భాగస్వామ్యం చేసేస్తున్నారు. అలా ఇప్పుడు గంగవ్వ అనవసరమైన వివాదంలో ఇరుక్కుంది.

    Gangavva Says Sorry to Chandrababu Naidu అయ్యయ్యో గంగవ్వ ఛానల్ గుట్టు విప్పేసింది

    ఓ టీవీ ఛానల్ వైసీపీకి ఫేవర్ గా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఉగాది పంచాంగం చెప్పించారు. ఇదొక డ్రామాగా చేశారు. గంగవ్వకి ఛానల్ ప్రతినిధులు ఏం మాట్లాడాలో చెప్పి మరీ ఆమెతో అనిపించారు. అయితే ఆ వీడియోని వైసీపీ సోషల్ మీడియాలో టీమ్ కట్ చేసి ప్రమోషన్స్ కి వాడుకుంది. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు గంగవ్వని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తెలుగుదేశానికి కరుడుగట్టిన అభిమానులు ఉంటారు. వారు వెళ్లి గంగవ్వతో నేరుగా చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్పించి వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు.

    How a village grandmother became a YouTube sensation | CNN

    ఇక ఆ వీడియోలో కూడా గంగవ్వ చంద్రబాబుకి క్షమాపణలు చెబుతూనే ఏడ్చినంత పని చేసింది. మొత్తానికి ఏపీ రాజకీయాల చలవ వలన అస్సలు వివాదాల జోలికి వెళ్ళకుండా తనకి భగవంతుడు ఇచ్చిన చిన్న అవకాశాన్ని వృద్ధాప్యంలో ఆశ్వాదిస్తోన్న గంగవ్వని అనవసరంగా వివాదంలోకి లాగారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గంగవ్వ క్షమాపణలు చెప్పిన వీడియోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా శ్రేణులు ట్విట్టర్, పేస్ బుక్ లో షేర్ చేస్తూ వైసీపీ మీద విమర్శలు చేస్తూ ఉండటం విశేషం.