Tamanna Bhatia : త‌మ‌న్నాకు సైబ‌ర్ పోలీసుల నోటీసులు

Tamanna Bhatia : టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కొత్త చిక్కుల్లో పడింది. తాజాగా ఈ అమ్మడికి మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించాడు. రూల్స్ కు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‎లను ఫెయిర్ ప్లే అప్లికేషన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఆమె ఎప్రిల్ 29న విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో తెలిపారు. తమన్న చేసిన ఈ పని వల్ల తమకు కోట్లలో నష్టం వచ్చిందని టెలికాస్ట్ రైట్స్ కలిగిన వయాకమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు తమన్నకు నోటీసులు పంపారు.

tamanna-bhatia-maharastra-cyber-crime-police-sent-notices-to-actress

ఇదే కేసులో ఇదివరకే బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కి కూడా పోలీసులు సమన్లు పంపారు. ఈ నెల 23న విచారణకు రావాలని తెలిపారు. అయితే సంజయ్ గైర్హాజరయ్యాడు. ఆ రోజు ముంబైలో లేకపోవడం వల్లనే విచారణకు రాకేకపోయానని తెలిపాడు. తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు మరో డేట్ ని సూచించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.

tamanna-bhatia-maharastra-cyber-crime-police-sent-notices-to-actress

ఐపీఎల్ మ్యాచుల డిజిట్ల టెలికాస్ట్ రైట్స్‎ను వయాకామ్ దక్కించుకుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్‎లను ఫెయిర్ ప్లే అప్లికేషన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఆ సంస్థ మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో ఫెయిర్ ప్లే యాప్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫెయిర్ ప్లే యాప్ కారణంగా తమకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని వయాకామ్ తన కంప్లైంట్ లో తెలిపింది.

tamanna-bhatia-maharastra-cyber-crime-police-sent-notices-to-actress

అంతేకాదు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ యాప్ డబ్బులు కూడా ఇచ్చినట్లు తెలిపింది. కురాకోలో ఉన్న ప్లే వెంచర్ అనే కంపెనీ అకౌంట్ నుంచి సంజయ్ దత్ కు సొమ్ము అందిందని తెలిపింది. సంజయ్ తో పాటు తమన్నాకు డబ్బులు అందాయని అందుకే వారిని సాక్షులుగా పేర్కొంటూ విచారించాలని వయాకామ్ కోరింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమన్నాకు తజాగా నోటీసులు పంపించారు. మరి మిల్కీ బ్యూటీ ఈ నోటీసులను సీరియస్ గా తీసుకుని విచారణకు హాజరవుతుందా లేదా మిగతా స్టార్స్ లాగే డుమ్మా కొడుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.