Ileana : గోవా బ్యూటీ ఇలియానా దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పోకిరి సినిమాతో అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలో ఆఫర్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఈ బ్యూటీ నటించిన చాలా వరకు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. ఒకటి కాదు రెండు కాదు స్టార్ హీరోయిన్ గా ఏకంగా దశాబ్దం పాటు ఇండస్ట్రీని ఏలింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ బాట పట్టింది ఈ చిన్నది. అయితే అమ్మడికి బీ టౌన్ లో అనుకున్నంత గుర్తింపు దక్కలేదు. ఒకటి అర మినహా ఇలియానా సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బాలీవుడ్ లో ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇలియానా ప్రేమయణాలు అప్పట్లో సెన్సేషనల్ న్యూస్ గా మారాయి. ఒకానొక సమయంలో బ్రేకప్ ల వల్ల ఆమె డిప్రెషన్ లోకి కూడా వెళ్లింది. ఇక ఇప్పుడేమో ఈ బ్యూటీ ఓ వ్యక్తిని ప్రేమించి ఓ బిడ్డకి తల్లి కూడా అయింది. ప్రస్తుతం తన కొడుకు , బాయ్ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉంది ఇలియానా. ఈ మధ్యనే సెకెండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తోంది.
చాలా రోజుల తర్వాత ఇలియానాకు మళ్లీ ఆఫర్స్ వస్తున్నాయి. లేటెస్ట్ ఇలియానా “దో ఔర్ దో ప్యార్” అనే మూవీ చేసింది. ఈ చిత్రంలో ఇలియానా చేసిన నోరా క్యారెక్టర్ కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోష్ల మీడియాలో వైరల్ అవుతున్నాయి. ” మూవీలోని క్యారెక్టర్ నా రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంది. నోరా మాదిరిగానే నేను చాలా సున్నితమైన అమ్మాయిని. డైరెక్టర్ శిరీష ఈ సినిమా కథ చెప్పగానే వెంటనే ఓకే అనేశాను. అయితే ఒకింత భయపడ్డాను. ఈ క్యారెక్టర్ కోసం జిమ్ వర్క్ ఔట్స్ ఏమైనా చేయాల్సి వస్తుందేమోనని భయం వేసింది. ఇప్పుడు అవి నేను చేసే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నేను మానసికంగా ఎంతో అలసిపోయాను . వెయిట్ లాస్ అవ్వడం ఇప్పట్లో నా వల్ల కాదని నేను డైరెక్టర్ తో డైరెక్ట్ గా చెప్పాను. .ఆమె నన్ను అర్ధం చేసుకుంది. బరువు తగ్గాల్సిన అవసరం లేదని చెప్పింది. మీరు ఎలా వున్నారో అలాగే కానిద్ధామని ధీమా ఇచ్చింది”అని ఇలియానా తెలిపింది.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.