Health Tips: ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కారణంగా మన శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇలా చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తప్రసరణ రేటు తగ్గిపోవడమే కాకుండా గుండెకు సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించాలి అంటే చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గించుకోవాలి.
ఇలా శరీరంలో పేరుకుపోయినటువంటి ఈ చెడు కొలెస్ట్రా తగ్గడం కోసం ఎంతోమంది ఎన్నో రకాల వ్యాయామాలు డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే అలా కాకుండా కేవలం ఈ పండ్ల రసాల ద్వారా మనం మన శరీరంలో పేరుకుపోయినటువంటి ఈ చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గించవచ్చు. మరి ఎలాంటి పండ్ల రసాలను తీసుకోవాలి అనే విషయానికి వస్తే మన శరీరంలో ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి దానిమ్మ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
దానిమ్మ రసంలో అధికంగా యాంటీ బయోటిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వును పూర్తిగా తగ్గించడంలో దోహదం చేస్తాయి అలాగే టమోటాలలో లైకోపీన్ ఉండటం వల్ల కూడా ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అందుకే ఈ జ్యూస్ తాగడం ఎంతో మంచిది వీటితో పాటు నారింజ గుమ్మడికాయ జ్యూస్ తాగటం వల్ల కూడా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది.