Categories: Health

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కారం తక్కువగా ఉండే క్యాప్సికం చాలామంది ఆహారంగా తీసుకోవడానికి మక్కువ చూపించరు. క్యాప్సికంలో మన ఆరోగ్యాన్ని రక్షించే అధిక ప్రోటీన్లు కేలరీలతో పాటు విటమిన్ సి, ఎ, ఇ, బి9, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు క్యాప్సికంను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికంను మన రోజువారి ఆహారంలో తరచూ తీసుకుంటుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా విటమిన్ సి ఐరన్ మూలకాన్ని గ్రహించడంలో మన శరీరానికి తోడ్పడి ఎర్ర రక్త కణాల అభివృద్ధిలో సహాయపడి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అంతే కాకుండా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని అరికట్టి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు తరచూ క్యాప్సికంను ఆహారంగా తీసుకుంటే కాప్సికమ్ లో ఉన్న ఔషధ గుణాలు పెయిన్ రిలీఫ్ గా పని చేస్తుంది.  ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ  గుణాలు అధికంగా ఉండుట వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గించటంలో సహాయపడి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాప్సికమ్ లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు తొలగించి కంటి ఆరోగ్యాన్ని కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా క్యాప్సికం ఎంతో దోహదం చేస్తుంది.

Sravani

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.