capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కారం తక్కువగా ఉండే క్యాప్సికం చాలామంది ఆహారంగా తీసుకోవడానికి మక్కువ చూపించరు. క్యాప్సికంలో మన ఆరోగ్యాన్ని రక్షించే అధిక ప్రోటీన్లు కేలరీలతో పాటు విటమిన్ సి, ఎ, ఇ, బి9, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు క్యాప్సికంను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికంను మన రోజువారి ఆహారంలో తరచూ తీసుకుంటుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా విటమిన్ సి ఐరన్ మూలకాన్ని గ్రహించడంలో మన శరీరానికి తోడ్పడి ఎర్ర రక్త కణాల అభివృద్ధిలో సహాయపడి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అంతే కాకుండా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని అరికట్టి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు తరచూ క్యాప్సికంను ఆహారంగా తీసుకుంటే కాప్సికమ్ లో ఉన్న ఔషధ గుణాలు పెయిన్ రిలీఫ్ గా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండుట వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గించటంలో సహాయపడి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాప్సికమ్ లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు తొలగించి కంటి ఆరోగ్యాన్ని కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా క్యాప్సికం ఎంతో దోహదం చేస్తుంది.