Tue. Jan 20th, 2026

    Tabu : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ను వేధించడం చాలా కామన్. కానీ, వాటిని చాకచక్యంగా తప్పించుకుంటున్నవారు ఉన్నారు. తప్పదని కాంప్రమైజ్ అయి కంటిన్యూ అవుతున్నవారూ ఉన్నారు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఎన్నో అవమానాలను చూసిన, చూస్తున్న నటీమణులు ఎందరో ఉన్నారు. బాడీ షేమింగ్ విషయంలో.. కలర్ విషయంలో.. ఫిజిక్ పరంగా రక రకాల కామెంట్స్ ఎదుర్కున్నవారు మన సీనియర్ నటీమణుల్లో చాలా మందే ఉన్నారు.

    అలాంటి వారిలో సీనియర్ నటి టబు కూడా ఉన్నారని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అది కూడా ఇటీవల ఇచ్చిన ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో స్వయంగా టబు వెల్లడించడంతోనే బయటపడింది. బాలీవుడ్ భామలు కంగన రనౌత్, ప్రియాంక చోప్రా లాంటి వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని స్టార్స్‌గా మారినవారే.

    tabu-intresting comments on cinema industry
    tabu-intresting comments on cinema industry

    Tabu : కెరీర్ ప్రారంభం నుంచి చాలానే ఇబ్బందులు..

    టబు కూడా అలా మేనేజర్స్, కాస్టింగ్ మేనేజర్స్ చేతిలో దర్శకనిర్మాతల చేతిలో ఎన్నో అవమానాలను చూశారట. ప్రేమదేశం, నిన్నే పెళ్ళాడతా సినిమాలతో అందరికీ కలల రాణిగా మారిన టబు, ఒక్కప్పుడు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ సీనియర్ నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన పాపులారిటీ ఉంది. కానీ, టబుకి ఈ స్థాయి ఊరికే రాలేదని వాపోయింది.

    పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందట. అలా ఎందుకు జరిగిందో కూడా తెలియదని ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు, ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలలో పాత్రలను ఒప్పుకున్నారట. ఎలాంటి పాత్ర అయినా ఓసారి కమిటైయ్యాక పూర్తి స్థాయిలో ఆ పాత్రకి న్యాయం చేయడానికే తాపత్రయపడ్డానని చెప్పుకొచ్చారు. టబు మాటలను బట్టి ఆమె కెరీర్ ప్రారంభం నుంచి చాలానే ఇబ్బందులను ఎదుర్కున్నట్టు అర్థమవుతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.