Taapsee Pannu : ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్..తాప్సీ లవర్ ఇతడే

Taapsee Pannu : ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను తెలుగు ఇండస్ట్రీ నుంచి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. మొదటి సినిమా ఝుమ్మందినాదం లోనే తన అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే అందం, నటన రెండూ ఉన్నా కూడా తెలుగులో ఆమెకు స్టార్ ఇమేజ్ దక్కలేదు. అనుకున్న హిట్ దక్కకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు మకాం మార్చింది. ఇక అక్కడ అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. ఓ వైపు సందేశాత్మక, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్టార్ హీరోలతో జత కడుతూ నార్త్ లో చెలరేగిపోతోంది తాప్సీ. సినీ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. రీసెంట్ గా షారుక్ ఖాన్ నటించిన మూవీ డంకీలో ఆయనకు జోడీగా నటించి మరోసారి అమ్మడి ప్రతిభను చూపించింది. ఇలా బాలీవుడ్‎లో సెటిల్ అయిన ఈ బ్యూటీ అప్పట్లో టాలీవుడ్ మేకర్స్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి ట్రోలింగ్ కి కూడా గురైంది. అయినా అవేమీ అమ్మడిని ఆపలేకపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం తప్సీ వయసు 36 ఏళ్లు. తన తోటి వయసున్న చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు.కానీ తాప్సీ మాత్రం ఇంత వయసొచ్చినా పెళ్లి మాట ఎత్తడంలేదు.

taapsee-pannu-opens-up-about-her-relationship-with-badminton-player-mathias-boe

ఇకపోతే తాప్సీ డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ మాథిస్‌ బో తో ప్రేమాయణం కొనసాగిస్తోందని ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వచ్చాయి. కానీ తాప్సీ మాత్రం ఎప్పుడూ ఈ అంశంలో స్పందించలేదు. మాథిస్, తాప్సీ ఇద్దరూ వెకేషన్స్ కు వెళ్లడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని అందరి నమ్మకం. మీడియా చాలా సార్లు ఈ విషయం గురించి గుచ్చి గుచ్చి అడిగినా తాప్సీ సమాధానం దాటేస్తూ వచ్చేది. ఒకానొక స‌మ‌యంలో తాప్సీకి మథియాస్ తో బ్రేక‌ప్ అయింద‌న్న న్యూస్ కూడా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో తాప్సీ ఈ రూమర్స్ కు తాజాగా చెక్ పెట్టింది. త‌న రిలేషన్‌షిప్ స్టేట‌స్ గురించి ఎట్టకేలకు ఓపెన్ అయింది. మథియాస్ తో తాను ల‌వ్ లో ఉన్న‌ానని క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు గత పదేళ్లుగా మాథిస్ ను లవ్ చేస్తున్నానని తాప్సీ తెలిపింది. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే మథిస్ తో ప‌రిచ‌యం ఏర్పడిందని, అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన్నే ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది.

taapsee-pannu-opens-up-about-her-relationship-with-badminton-player-mathias-boe

తాప్సీ తన రిలేషన్ గురించి మాట్లాడుతూ..” బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే మాథిస్ తో పరిచయం ఏర్పడింది. గ‌త ప‌దేళ్ల‌ుగా మథిస్ తో రిలేషన్ లో ఉన్నాను. ఇన్ని రోజులు అతనితో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ అతడికి బ్రేకప్‌ చెప్పాలన్న ఆలోచన రాలేదు. మరొక‌రితో రిలేష‌న్ ప్రారంభించాల‌న్న‌ కోరిక కలగలేదు. మా బంధం రాను రాను చాలా బలంగా మారింది. అయితే నా లవ్ మేటర్ మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే లవ్, మ్యారేజ్ విషయంలో నాకంటూ కొన్ని నిర్థిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి”. అని తాప్సీ తెలిపింది. దీంతో తాప్సీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ప్రేమ విషయం ఓకే మరి పెళ్లి ఎప్పుడు అంటూ నెటిజన్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు. మరి తాప్సీ పెళ్లి క‌బురు ఎప్పుడు చెబుతుందో చూడాలి మరి.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.