Taapsee Btech Student : ప్రస్తుతం యువత ఎంత్ప విభిన్నంగా ఆలోచిస్తోంది. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగమే చేయాలని పట్టుపట్టి కూర్చోవడం లేదు. టాలెంట్‌తో ఊహకందని పనులు చేస్తూ అద్భుతమైన సంపాదనను పొందుతున్నారు. ప్రస్తుతం అంతటా ఒకటే హాట్ టాపిక్ 21 ఏళ్ళ బీటెక్ విద్యార్థిని తాప్సీ గురించే. ప్రస్తుతం అన్నీ రకాలుగా సమాజంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పరిస్థితులకు అనుకూలంగానే నేటి యువతరం సరికొత్త ఆలోచనలు చేస్తుంది.
ఇలా చదువు పూర్తి అవగానే అవకాశం వచ్చిన కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం చేయాలని భావించడం లేదు. సరికొత్త ఆలోచనలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. అవసరమైతే ఎవరెన్ని రకాలుగా విమర్శిస్తున్నప్పటికీ లెక్కచేయడం లేదు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో దిల్లీకి చెందిన 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్ చేరడం సంచలనంగా మారింది. ఇంజనీరింగ్ చదినప్పటికి తనకొచ్చిన వినూత్న ఆలోచనతో పానీపూరీ బిజినెస్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బీటెక్ పానీపూరీవాలీ’ పేరుతో ఓ బుల్లెట్ బండికి పానీపూరీ డబ్బాను అమర్చుకొని దగ్గర్లోని వీధుల్లో తిరుగుతూ పానీపూరీలు అమ్ముతోంది. ప్రస్తితం తాప్సీ ఇలా పానీపూరీలు అమ్ముతూ సందడి చేస్తున్న వీడియో బాగా వైరలైంది.
Taapsee Btech Student : మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
దిల్లీ ప్రాంతానికికి చెందిన తాప్సీ ఉపాధ్యాయ్ చదివింది ఇంజనీరింగ్. అయితే, ఆమె చదువు పూర్తి చేసిన తర్వాత అందరిలా తానుకూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకోలేదు. అన్నిటికీ పూర్తి వినూత్నంగా ‘స్ట్రీట్‌ఫుడ్’ బిజినెస్ చేయాలనుకుంది. ఆలోచన వరకూ బాగానే ఉన్నా ఎటువంటి ఫుడ్‌తో వ్యాపారం చేయాలో మాత్రం అంత త్వరగా తేల్చుకోలేకపోయింది. కానీ, ఏది ఎంచుకున్నా ఆ ఫుడ్ అందరికీ నచ్చే విధంగా, ఆరోగ్యకరంగా ఆమోదదాయకంగా తప్పకుండా ఉండాలని నిర్ణయించుకుంది. వీటిలో నుంచి వచ్చిన ఆలోచనే పానీపూరీ వ్యాపారం. అదే ఎంచుకుంది. ఈ విషయంలో చదివుకి సంబంధం లేని పనిచేస్తున్నావనే విమర్శలనూ ఎదుర్కొంది. అయినా తన నమ్మకాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళిన తాప్సీ‘సర్వింగ్ హెల్త్’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘బీటెక్ పానీపూరీవాలీ’ని మొదలుపెట్టింది.
పానీపూరీ వ్యాపారం ప్రారంభించే ముందు తన తన ఆలోచనను తాప్సీ అత్యంత సన్నిగులైన వారితో పంచుకుంది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నాకూడా సన్నిహితులు, స్నేహితులు సపోర్ట్ చేయడంతో ముందడుగు వేసింది. పానీపూరీ అంటే చాలామందిలో ఆరోగ్యానికి మంచి ఫుడ్ కాదనే అభిప్రాయం ఉంటుంది. అందుకే ఈ విషయంలో బాగా అధ్యయనం చేసి 7 నెలల పాటు రీసెర్చ్ చేసింది. ఫైనల్‌గా అందరూ ఆమోదం తెలిపేలా పానీపూరీని అమ్మడం మొదలుపెట్టింది.
Taapsee Btech Student : ఈ పానీపూరీకి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి..
మామూలుగానే గత కొంతకాలంగా స్ట్రీట్‌ఫుడ్ కి జనాలు అన్నీ ప్రాంతాలలో ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడో కొందరిలో ‘పరిశుభ్రత పాటించరు’ అనే అభిప్రాయం ఉంది. అదే విషయంలో తాప్సీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. పానీపూరీ పదార్థాలను తయారు చేసే విధానం నుంచి కొనేవారికి చేరవేసే వరకూ తన చేతులకు తప్పకుండా గ్లవ్స్ లను ధరిస్తుంది. ముఖ్యంగా పానీపూరీలు చేసేందుకు ఆయిల్ ఉపయోగించడం, ఎక్కువగా వేయించడం చేస్తుంటారు. కానీ, తాప్సీ ఈ పద్ధతిని ఫాలో కాలేదు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని.. దీనికి బదులుగా పూరీలు చేసేందుకు ఎయిర్ ఫ్రై పద్ధతిని పాటిస్తుంది. అంతేకాదు, మైదా పిండి వాడకం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదని వేరే పిండిని ఉపయోగిస్తుంది. ఉప్పు కూడా ఆరోగ్యానికి మేలు చేసే హిమాలయన్ పింక్ రాక్ బ్రాండ్ ని ఉపయోగిస్తుంది. నీళ్లు (పానీ) తయారీ పద్ధతిలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.