Kids Health: సాధారణంగా చిన్న పిల్లలు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కానీ ఆ సమస్యలను బయటకు చెప్పడానికి వారికి తెలియక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వారు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని పెద్దలు గమనిస్తూ ఉంటారు. అయితే పిల్లలలో కనుక ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయి అంటే వారి పొట్టలో నులిపురుగులు ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి నులిపురుగుల సమస్యతో బాధపడేవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే విషయానికి వస్తే..
చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఆటలలో నిమగ్నం అవుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు వాళ్లు బయట మట్టిలో ఆడే సమయంలో కూడా తమ చేతులను నోట్లో పెట్టుకోవడం లేదంటే మట్టిలో ఆడిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల మట్టిలో ఉన్న దుమ్ము, దూళి అలాగే ఇతర హానికర బ్యాక్టీరియాలు వారి పొట్టలో చేరే అవకాశాలు ఉంటాయి. తద్వారా తీవ్రమైన కడుపునొప్పి సమస్య ఏర్పడుతుంది అలాగే నులిపురుగుల సమస్యతో బాధపడే పిల్లలు ఆహారం తినడానికి ఆసక్తి చూపరు.
ఇక ఆహారం తీసుకున్న కూడా వారు శరీర బరువు తగ్గుతూ ఉంటారు.మల ద్వారంలో దురదగా ఉంటుంది. రాత్రుళ్లు నిద్రకు దూరమవుతుంటారు. చిన్నారుల్లో చాలా కాలంగా నిద్రలేమి సమస్య ఎదురవుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే చిన్నారులు నిత్యం కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నా నులి పురుగులతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే వాంతులు అవుతున్నా, వికారంగా ఉంటున్నా నిత్యం.. కడుపునొప్పి, తిమ్మిరి వంటి సమస్యలతో పాటు అతిసారం వంటి లక్షణాలు కనపడుతుంటాయి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.