Health Tips: సాధారణంగా మన శరీరానికి సరిపడా రక్తం ఎంతో అవసరం అనే సంగతి మనకు తెలిసిందే. రక్తం బాగా అభివృద్ధి చెందినప్పుడు ఎర్ర రక్తకణాలు సంఖ్య అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో అన్ని జీవక్రియలు కూడా సక్రమంగా జరుగుతాయి. మన శరీర భాగాలకు కావాల్సినంత ఆక్సిజన్ సరఫరా అవడంతో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి అలా కాకుండా రక్తం తక్కువగా ఉన్నప్పుడు అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో గుండె అధికంగా శ్రమించాల్సి వస్తుంది.
గుండెపై అధిక ఒత్తిడి కలిగినప్పుడు చాతిలో మంటగా ఏర్పడటమే కాకుండా గుండె నొప్పి సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందుకే మనకు ఎర్ర రక్త కణాల సంఖ్య అధికంగా ఉండాలని చెబుతుంటారు అయితే చాలామందిలో కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక వారిలో రక్తం తక్కువగా ఉందని అర్థం. ఎక్కువగా నొప్పి వచ్చిన కొంత దూరం నడిచినా కూడా తొందరగా అలసిపోయి శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు.
ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే వారు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అర్థం అదే విధంగా ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో వారిలో సున్నం తినాలని బలపాలు తినాలని కోరికలు అధికంగా కలుగుతూ ఉంటాయి. వీటితోపాటు తరచూ తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు అంటే మీలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయిందని అర్థం ఎప్పుడైతే ఎర్ర రక్తకణాలు తగ్గుతాయో మీరు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అదే సమయంలో మీ మొహం మొత్తం తెల్లగా పాలిపోయి ఉంటుంది. లక్షణాలు కనుక మీలో కనపడితే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.