Swapnalok Complex: సికింద్రాబాద్ లో స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని`ప్రమాదంలో అంతులేని విషాదం మిగిలింది. ఈ ప్రమాదంలో పొగలో చిక్కుకొని ఊపిరి ఆడక ఏకంగా ఆరు మంది మృతి చెందారు. అయితే ఈ ఆరుగురు ఒకే కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్న వారు కావడం విశేషం. ఆరుగురు కూడా ఒకే గదిలో చిక్కుకొని ఊపిరి ఆడక ఒకరి కళ్ళముందు ఒకరు మరణంతో పోరాటం చేస్తూ చివరికి మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఈ విషాదం మరోసారి హైదరాబాద్ లో ఎత్తైన భవంతులలో ఫైర్ సేఫ్టీపై ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రతి చోట సూచిస్తుంది. అయితే ఈ చనిపోయిన వారిలో నలుగురు అమ్మాయిలు ఉండటం విశేషం. త్రివేణి, శ్రావణి, వెన్నెల, ప్రమీల, శివ, ప్రశాంత్.
వీరందరూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. కుటుంబానికి సాయంగా `ఉందామని భాగ్యనగరానికి వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు ఉద్యోగం వచ్చింది. అయితే ఇదొక చట్టవిరుద్ధమైన కంపెనీ అనే విషయం వారికి తెలియదు. కాని డబ్బులు కడితే మంచి భవిష్యత్తు ఉంటుందని వారు చెప్పిన మాటలని నమ్మారు. కుటుంబాన్ని అడిగి ఒక్కొక్కరు రెండు లక్షల వరకు తీసుకొచ్చి చెల్లించారు. ఉద్యోగాలలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. వారు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నది కూడా వారికి అర్ధం కాని పరిస్థితి. అలాగే తాము చేస్తున్న కంపెనీ ఎవరిది అనే సమాచారం కూడా వారి దగ్గర లేదు.
క్యూ నెట్ అనే మల్టీ మార్కెటింగ్ కంపెనీ మీద నిషేధం ఉండటంతో ఆ సంస్థ తన పేరు మార్చుకొని మళ్ళీ కార్యకలాపాలు మొదలు పెట్టింది. అందులో పని చేస్తున్న వారే వీరంతా. అయితే తమ కంపెనీలు ఏకంగా ఆరుమంది ఉద్యోగులు చనిపోయిన కూడా సంస్థ ప్రతినిధులుగా ఒక్కరు కూడా బయటకి రాకపోవడం చూస్తుంటే దీని వెనుక ఎంత మోసం ఉందనేది అంచనా వేయొచ్చు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ ఆరుమంది మరణానికి బాధ్యులు ఎవరు. వారి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేది ఎవరు అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న