Suma Kanakala : టాలీవుడ్ స్టార్స్ సినిమాల వేడుకలు ఉన్నాయంటే కచ్చితంగా ఆమె ఉండాల్సిందే. సినిమా హిట్ కొట్టాలంటే ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయాల్సిందే. సొంతూరు పక్క రాష్ట్రమైనా తన కట్టు బొట్టు, మాటలతో తెలుగింటి ఆడపడుచు అయ్యింది. బుల్లి తెర మీద తనదైన యాంకరింగ్ తో అందరినీ కట్టిపేడుస్తుంది సుమ కనకాల.కేరళలోని పాలక్కాడ్ లో పుట్టిన సుమ, రాజీవ్ ను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలింగ సెటిల్ అయిపోయింది. గత 25 ఏళ్లుగా వ్యాఖ్యాతగా తనదైన ముద్రను వేసింది సుమ. ప్రేక్షకులను యాంకరింగ్ కట్టిపడేస్తూ 48 ఏళ్ల వయసులోనూ ఇండస్ట్రీలో అగ్రిస్థానంలో ఉంది. ఇప్పుడు తన కుమారుడిని సినిమాల్లోకి గట్టి ఎంట్రీ ఇప్పించాలని తెగ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సుమ కొడుకు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ మూవీ తో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో సుమ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసింది.
సొసైటీ లో చాలామంది ఒంటరి మహిళలు తండ్రి లేకున్నా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉపాధి కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. కొందరు ఇళ్లల్లో పనిమనిషి గా కూడా పనులు చేసేందుకు వెనుకాడరు. వారికి కనీసం బ్యాంక్, డబ్బులు దాచుకోవాలి, ఇన్సూరెన్స్లు.. వంటి వివరాలు ఏమి తెలియవు. ఒకవేళ వారి భర్త ఇన్సూరెన్స్ చేసి ఉంటే అతను చనిపోయాక ఎంతో కొంత డబ్బులు వచ్చేవి. కానీ వాళ్లకు ఆ సమాచారం కూడా తెలీదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు చుట్టూ ఉన్నవారిలో కొందరికైనా వీటి గురించి మనం చెప్పాలని సుమ తెలిపింది.
” నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. ఒకవేళ సడన్గా చనిపోవాల్సి వస్తే అన్న ప్రశ్న నాకు ఎదురైంది. అందుకే నాకు సంబంధించిన ఇన్సూరెన్స్ల గురించిన వివరాలను నా ఇద్దరు పిల్లలకు చెప్పాను. ఏదైనా కారణాలతో సడెన్ గా నేను చనిపోతే ఇన్యూరున్స్ ద్వారా ఎవరికి ఎంత వస్తుంది..? ఎక్కడెక్కడి నుంచి డబ్బు ఎంత వస్తుంది..? అనే విషయాలన్నీ నా పిల్లలను కూర్చోబెట్టి వివరంగా చెప్పాను. కానీ ఆ సమయంలో ఎందుకు మమ్మీ ఇలాంటివి చెప్పడం అని అన్నారు. ఏదేమైనా పిల్లలకు వాస్తవాలు చెప్పాలి. రేపటి గురించి ఏం జరుగుతుందో ఎవరికీ క్లారిటీ లేదు అందుకే ముందుగానే పిల్లలకు అన్ని విషయాలు ధైర్యంగా చెప్పాలి. ఆ బాధ్యత మనమీదే ఉంది ” అని సుమ తెలిపింది. తాజాగా సుమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.