Sugercane: ప్రస్తుత కాలంలో మనకు చెరుకు ఎంతో విరివిగా లభిస్తుంది. ఇలా చెరుకు తినడానికి అలాగే చెరుకు రసం తాగడానికి పెద్దవారి నుంచి మొదలుకొని చిన్న పిల్లల వరకు కూడా ఎంతో ఇష్టపడుతుంటారు. ఇలా చెరుకు రసం తాగటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదుర్కొని దగ్గు జలుబు వంటి సమస్యలను కూడా ఈ చెరుకు రసంతో పోగొట్టుకోవచ్చు.
దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ చెరుకు రసం తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని కలిపి చిన్న మంట పై వేడి చేయాలి.గోరువెచ్చగా ఉన్నప్పుడు కనక తాగితే దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. అలాగే చాలామంది మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి మంట సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కూడా చెరుకు రసం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.
Sugercane:
ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు అర గ్లాసు చెరుకు రసంలోకి అర గ్లాస్ కొబ్బరినీళ్లు, అర టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపితాగటం వల్ల ఈ నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఇలాంటి నొప్పి మంట సమస్య ఉంటుంది ఈ జ్యూస్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం మన సొంతం చేసుకోవచ్చు.