Health: పెళ్లి తర్వాత చాలా మంది ఆడవాళ్ళు వెంటనే పిల్లల్ని కనకూడదు అని అనుకుంటారు. శారీరకంగా కలిసిన కూడా పిల్లలు కలగకుండా ఉండటం కోసం కండోమ్స్ ఉపయోగిస్తారు. మగవారు ఎక్కువగా ఈ కండోమ్స్ ఉపయోగించడం వలన పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడతారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కూడా బిడ్డకి బిడ్డకి మధ్య గ్యాప్ ఉండాలని భావిస్తారు. అయితే భార్యాభర్తలు మాత్రం కలవకుండా ఉండలేరు. అయితే కొన్ని సందర్భాలలో పిల్లలు పుట్టకుండా గర్భనిరోధక మాత్రలని మహిళలు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం కాలంలో లివింగ్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి.
ప్రేమించుకొని కలిసి ఉండటం అనేది కామన్ అయిపొయింది. ఇలాంటి సమయంలో కూడా పార్ట్ నర్స్ తో శారీరకం సంబంధం పెట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇప్పుడు గర్మ నిరోధక మాత్రలుగాని, కండోమ్స్ గాని ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఓ కొత్త సాధనం అందుబాటులోకి వచ్చింది. మహిళలు దీనిని ఉపయోగిస్తే శారీరకంగా కలిసిన కూడా గర్భం రాదు. కేంద్ర ప్రభుత్వం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చి ముందు తెలుగు రాష్ట్రాలలోనే వినియోగంలోకి తీసుకొచ్చింది.
ఈ సాధనం 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల పొడవుతో సూదిలా ఉంటుంది. దీనిని మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. దీంట్లో నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిజానికి ఈ సాధనం హార్మోన్‌తోనే తయారవుతుంది. ఇక ఈ విధానాన్ని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పిలుస్తున్నారు. ఇక అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా దీనిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నర్స్ లు కూడా ఈ సాధనం అమర్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.