Thu. Jan 22nd, 2026

    Chandrababu:ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాల లక్ష్యంగా చేసుకొని ఎప్పటికప్పుడు దాడులకు భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు తెగపడటం తరచుగా జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. మంచి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ముందుగా నల్ల బెలూన్లతో చంద్రబాబు పర్యటనకు నిరసనగా ఆందోళనలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే ఏకంగా రోడ్డుపై షర్టు విప్పి మరీ చంద్రబాబుకు సవాలు విసిరారు.

    Tension at CBN Tour: రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులు.. ఖబడ్దార్​ అంటూ  హెచ్చరించిన చంద్రబాబు, tension at chandrababu tour in yerragondapalem in  prakasam district

    ఇదిలా ఉంటే మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం ముందు చంద్రబాబు కాన్వాయ్ వెళుతూ ఉన్న సమయంలోనే వైసిపి కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం జరిగింది. అయితే చంద్రబాబుకు రాళ్ల దెబ్బలు తగలకుండా ఎన్.ఎస్.జి సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అడ్డుపెట్టి నివారించారు. మంత్రి సురేష్ సారధ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. పట్టణంలో చంద్రబాబు సభ నిర్వహించాల్సి ఉండగా విద్యుత్ సరఫరా కూడా నిలిపేసి అంతరాయం కలిగించినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.

    TDP: Chandrababu on one side.. Adimulapu Suresh on the other.. High tension  at every step in Yarragondapalem.. | TDP chief Chandrababu stopped his car  in front of Minister Adimulapu Suresh's House in

    ప్రతిపక్షాలు లేకుండా చేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఈ దాడులను చూస్తుంటే తెలుస్తుందని అన్నారు. ఇలాంటి దాడులతో ప్రశ్నించే ప్రతిపక్షాల నొక్కేయలిని ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యం విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అంటూ విమర్శించారు. ఇక చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో ఒక ఎన్ఎస్జి సిబ్బందికి గాయాలు అయ్యాయి. అతని హాస్పిటలకు తరలించి చికిత్స అందించారు. తర్వాత చంద్రబాబు అతనిని పరామర్శించారు. ఈ ఘటంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి అనేది వేచి చూడాలి.