Wed. Jan 21st, 2026

    BRS Party: ఏపీ రాజకీయాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీతో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చిన తర్వాత తెలంగాణకు ఆనుకుని ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ పడింది. అందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్రలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలాన్ని పెంచుకునే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను అజెండాగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు. ఉద్యమాలు చేసి దీన్ని సాధించుకున్నారు.

    KCR's key decision on steel plant, directly – a huge shock to AP  parties..!! | KCR Sensational Decision: Telangana to participate in Vizag  Steel plant Bidding, Officials to visit Visakha

    అయితే స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఏపీలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ అంశంపై గట్టిగా పోరాడటం లేదు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అజెండాగా మార్చుకొని ఏపీలోకి దూసుకుపోవాలని భావిస్తుంది. స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్ వేయడానికి కూడా రెడీ అయింది. స్టీల్ ప్లాంట్ ని కొనుగోలు చేయడం ద్వారా ఏపీ ప్రజల మెప్పు పొందాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

    Telangana cm kcr plans historic bid to secure Vizag steel plant

    గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొనుగోలు చేస్తుందంటూ హామీ ఇచ్చారు. తర్వాత దీనిపై ఎప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి బిడ్ వేయడానికి రెడీ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఉపయోగించుకొని సాగరతీరంలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సభ ద్వారా ఏపీలో బలమైన నాయకులని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాధ్యతలని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కి అప్పగించారు.