Pawan Kalyan: పవన్‌తో ప్రయాణం మొదలుపెట్టిన స్టార్ ప్రొడ్యూసర్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమై ఇప్పట్లో సినిమాలకి సైన్ చేయడనే మాట ఇటీవల సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టిన వార్త. కానీ, అది నిజం కాదని..న్యూఇయర్ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి-దర్శక,రచయిత వక్కంతం వంశీలతో కలిసి దిగిన ఓ లేటెస్ట్ ఫొటోను షేత్ చేస్తూ ఇంతకముందు ప్రకటించిన ప్రాజెక్ట్‌ను మళ్ళీ అఫీషియల్‌గా ప్రకటించి తెలియజేశారు.

అంతేకాదు, వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్‌కి మంచి హిట్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్‌లో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓ సినిమాను చేయడానికి అంగీకరించాడని, డేట్స్ కూడా ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే, ఓజీ పార్ట్ 2 కూడా ఉండబోతుందనేది స్వయంగా దర్శకుడు సుజీత్ వెల్లడించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా షూటింగ్ కంప్లీటై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. మార్చి లేదా ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నారు.

star-producer-started-a-journey-withpawan-kalyan

Pawan Kalyan: అతి త్వరలోనే సురేందర్ రెడ్డి, పవన్ సినిమా సెట్స్‌పైకి రాబోతోంది.

ఇక, అతి త్వరలోనే సురేందర్ రెడ్డి, పవన్ సినిమా సెట్స్‌పైకి రాబోతోంది. ఇవి కాకుండా నిర్మాత టిజీ విశ్వప్రసాద్‌తో కలిసి పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించబోతున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్-పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల ద్వారా వీరిద్దరు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ కొత్త సినిమాలను నిర్మించడానికి ఒక్కటైయ్యారు. అలాగే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయో సినిమా కూడా ఉండబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

కనీసం ఇంకో 10 నుంచి 15 ఏళ్ళ వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోలీవుడ్ నిర్మాణ సంస్థ కేవిన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే, సంస్థ టాలీవుడ్‌లో అడుగుపెడుతూ, మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో ఓ సినిమాను ప్రకటించింది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. మొత్తానికి, పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు..మరోవైపు తాను హీరోగా సినిమాలు, మరో అగ్ర నిర్మాతతో కలిసి సినిమాలు నిర్మించడానికి పర్ఫెక్ట్‌గా ప్లాన్స్ చేసుకోవడం అభిమానులకి ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

7 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.