Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమై ఇప్పట్లో సినిమాలకి సైన్ చేయడనే మాట ఇటీవల సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టిన వార్త. కానీ, అది నిజం కాదని..న్యూఇయర్ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి-దర్శక,రచయిత వక్కంతం వంశీలతో కలిసి దిగిన ఓ లేటెస్ట్ ఫొటోను షేత్ చేస్తూ ఇంతకముందు ప్రకటించిన ప్రాజెక్ట్‌ను మళ్ళీ అఫీషియల్‌గా ప్రకటించి తెలియజేశారు.
అంతేకాదు, వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్‌కి మంచి హిట్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్‌లో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓ సినిమాను చేయడానికి అంగీకరించాడని, డేట్స్ కూడా ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే, ఓజీ పార్ట్ 2 కూడా ఉండబోతుందనేది స్వయంగా దర్శకుడు సుజీత్ వెల్లడించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా షూటింగ్ కంప్లీటై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. మార్చి లేదా ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నారు.

Pawan Kalyan: అతి త్వరలోనే సురేందర్ రెడ్డి, పవన్ సినిమా సెట్స్‌పైకి రాబోతోంది.
ఇక, అతి త్వరలోనే సురేందర్ రెడ్డి, పవన్ సినిమా సెట్స్‌పైకి రాబోతోంది. ఇవి కాకుండా నిర్మాత టిజీ విశ్వప్రసాద్‌తో కలిసి పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించబోతున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్-పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల ద్వారా వీరిద్దరు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ కొత్త సినిమాలను నిర్మించడానికి ఒక్కటైయ్యారు. అలాగే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయో సినిమా కూడా ఉండబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
కనీసం ఇంకో 10 నుంచి 15 ఏళ్ళ వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోలీవుడ్ నిర్మాణ సంస్థ కేవిన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే, సంస్థ టాలీవుడ్‌లో అడుగుపెడుతూ, మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో ఓ సినిమాను ప్రకటించింది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. మొత్తానికి, పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు..మరోవైపు తాను హీరోగా సినిమాలు, మరో అగ్ర నిర్మాతతో కలిసి సినిమాలు నిర్మించడానికి పర్ఫెక్ట్‌గా ప్లాన్స్ చేసుకోవడం అభిమానులకి ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.

