SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ దీనికి సంబంధించిన అప్‌డేట్ ని వీడియో రూపంలో వదిలారు. ఒక జీప్ లో కూర్చొని రాజమౌళి లొకేషన్స్ చూస్తున్నారు. అంతేకాదు, మహేశ్ నటించిన ‘టక్కరి దొంగ’ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో అనే పాట వినడం ఆసక్తికరం.
ఇటీవల ఈ సినిమా గురించి రాజమౌళి కూడా అంతర్జాతీయ మీడియాతో సమావేశం అయినప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ అలాగే జంతువులతో కలిసి భారీ యాక్షన్ సీన్ తీసిన సంగతి తెలిసిందే. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ మహేశ్-రాజమౌళి సినిమాలోనూ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు.
దీంతో భారీగానే అంచనాలు మొదలయ్యాయి. ఇక ఒక్కో అప్‌డేట్‌తో ప్రపంచవ్యాప్తంగానూ అంచనాలు మొదలయ్యాయి. కాగా, ఎస్ఎస్ఎంబి 29 జనవరి 2025 నుంచి సెట్స్‌పైకి రానుంది. రాజమౌళి సినిమా కోసం దాదాపు మహేశ్ రెండేళ్ళు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డా. KL నారాయణ 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్నించనున్నట్టు సమాచారం.
ఇటీవల కాలంలో మహేశ్ కి ఆశించిన సక్సెస్ దక్కలేదనే చెప్పాలి. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వచ్చిన ‘సర్కారు వారి పాట’, ‘గుంటూరు కారం’ అందరిని బాగా డిసప్పాయింట్ చేశాయి. అయినా ఇప్పటి వరకూ ఫ్లాప్ ఎరగని రాజమౌళి కి వచ్చిన పాన్ ఇండియా క్రేజ్‌తో ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకు తగ్గట్టే రాజమౌళి సౌత్ యాక్టర్లతో పాటు కొందరు హాలీవుడ్ యాక్టర్స్ ని ఎంచుకోకున్నారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.