The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మిగతా భాషల్లో ‘ది రాజాసాబ్’ పేరుతో రిలీజ్ కానుంది. డార్లింగ్ సినిమా అంటే ‘బాహుబలి’ తర్వాత నుంచి ప్రపంచ దేశాలలో ఉన్న క్రేజ్ వేరే లెవల్. ‘సలార్’, ‘కల్కి’ వంటి వరుస హిట్స్‌తో మాంచి జోష్ మీదున్న ప్రభాస్ ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ‘రాజాసాబ్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

డార్లింగ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి ప్రభాస్ న్యూ లుక్ ని మేకర్స్ విడుదల చేసి విషెస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులు, డార్లింగ్ ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పారు. అయితే, తాజాగా విడుదల చేసిన ‘రాజాసాబ్’ లుక్ మీదే అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ ని చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..? అంటూ చర్చించుకుంటున్నారు.

the-raja-saab-do-you-remember-rajinikanth-when-you-see-prabhas-look

The Raja Saab: సరికొత్త లుక్ లో అదరగొట్టారు.

గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార నటించిన ‘చంద్రముఖి’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలోని రజినీ లుక్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ‘రాజాసాబ్’ సినిమాలో కూడా ప్రభాస్ లుక్ ఇంచు మించు అలాగే ఉందంటున్నారు. ఇంతకముందు టీజర్ లో ఎంతో స్టైలిష్‌గా కనిపించి షాకిచ్చారు ప్రభాస్.

ఇప్పుడు మేకర్స్ వదిలిన సరికొత్త లుక్ లో అదరగొట్టారు. కానీ, హర్రర్ నేపథ్యంలో వస్తున్న ‘రాజాసాబ్’ పోస్టర్ మాత్రం ‘చంద్రముఖి’ సినిమాలోని రజినీ పాత్రను గుర్తు చేస్తుందంటున్నారు. ఇందులో ఆయన సైకియాట్రిస్ట్‌గా, వేంకటపతి మహారాజుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. మరి ‘రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ ఎన్ని గెటప్స్ లో కనిపించి సందడి చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా..నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్దికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

TDP PARTY: టీడీపీకి రాజ్యసభ గండం.. లోకేష్ ఎంట్రీతో సీన్ మారుతుందా?

TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…

21 minutes ago

Telangana: జనసేన సభకు నో పర్మిషన్.. రూటు మార్చిన‌ పవన్..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…

2 hours ago

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

2 hours ago

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

7 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

18 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

1 day ago

This website uses cookies.