SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ భూమీ పడ్నేకర్ ఓ కథానాయికగా నటించబోతుందని ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఇందులో మేయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే తప్పుకుందా..? అనే సందేహాలు మొదలయ్యాయి.
SSMB28 : మరి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం..
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా లాంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాకపోయినా స్మాల్ స్క్రీన్ మీద మాత్రం ప్రేక్షకులను బాగా అలరించాయి. ఎప్పుడు టీవీలో వచ్చినా ఈ సినిమాలు మంచి టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేశాయి. దాంతో ఈ కాంబోలో మూడవ సినిమా అంటే అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక త్రివిక్రమ్ సినిమా అంటే తెరనిండా నటీనటుడు మంచి పాత్రలతో సందడి చేస్తారు. అలాగే ఈ సినిమాలోనూ హీరోయిన్స్‌గా పాన్ ఇండియా స్టార్ పూజా హెగ్డే, మరో క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పుడు మూడవ హీరోయిన్‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ పడ్నేకర్ కూడా నటించబోతుందని తాజా సమాచారం. భూమికి హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. అదే క్రేజ్‌తో ఈ ఛాన్స్ దక్కించుకుందని టాక్. అంతేకాదు, త్రివిక్రమ్ మహేష్ 28వ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాట. అందులో భాగంగానే భూమీ పడ్నేకర్‌ను మరో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానున్నట్టు సమాచారం.