Categories: EntertainmentLatest

Sridevi : అద్దెకు శ్రీదేవి ఇల్లు..వారికి మాత్రమే ఛాన్స్

Sridevi : మీరు ఎప్పుడైనా బాలీవుడ్ సెలబ్రిటీల ఒక్క రోజైనా రియల్ లైఫ్ లో బ్రతకాలని కలలు కన్నారా? ఒకవేళ మీకు అలాంటి కలే ఉంటే మీ ఊహలు నిజం కాబోతున్నాయి. అలనాటి నటి అందాల తార దివంగత శ్రీదేవి కొన్న మొట్టమొదటి ఇంట్లో మీరు ఉండే లక్కీ ఛాన్స్ అందిస్తోంది ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్. చెన్నైలోని తన చిన్ననాటి నివాసానికి మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.

sridevi-chennai-mansion-for-rent

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో స్టార్‌ నటిగా ఎదిగి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. ఆమె అందం, నటనకు ఫిదా కానివారంటూ ఎవరూ ఉండరు. ఆమె చనిపోయి కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె ప్రేక్షకుల హృదయాల్లోనే నిలిచిపోయింది. ఆమెకు ఆమె చిత్రాలకు వీరాభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆమె ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడింది. ఆమె కష్టపడిన సొమ్ముతో మొట్టమొదటిసారిగా చెన్నైలో శ్రీదేవి ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో పెళ్లి తర్వాత ఈ ఈ బీచ్‌ హౌజ్‌ను శ్రీదేవి కాన్నారు. సౌత్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నప్పుడు శ్రీదేవి ఎక్కువ సమయం చెన్నైలో ఉండేవారు. అందుకే ఆమె ఎంతో ముచ్చటపడి ఈ మాన్షన్ ను కొనుగోలు చేశారు.

sridevi-chennai-mansion-for-rent

ఈ ఇల్లంటే జాన్వీకి ఎంతో సెంటిమెంట్. ఆమె చిన్నతనం ఎక్కువగా ఇక్కడే గడిపింది. శ్రీదేవీ కూడా ఈ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా రినొవేట్ చేయించారు. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన కళాఖండాలతో ఇంటిని విలాసవంతంగా తీర్చిదిద్దింది. మేంటేనెన్స్ కారణంగా శ్రీదేవీ ఫ్యామిలీ ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే శ్రీదేవీ మరణం తర్వాత 2022లో బోనీకపూర్ ఆ ఇంటిని రెనొవేట్ చేశారు. జాన్వీకపూర్ చిన్నతనాన్ని గడిపిన ఈ ఇల్లు వోగ్ లో కూడా ప్రదర్శించారు.

sridevi-chennai-mansion-for-rent

అయితే ఇప్పుడు ఎంతో ఖరీదైన, ఎన్నో స్పెషాలిటీస్ ఉన్న ఇంట్లో ఉండే అవకాశాన్ని కల్పించింది అంతర్జాతీయ సంస్థ airbnb.శ్రీదేవి నివసించిన ఆ విలాసవంతమైన మాన్షన్‌ను రెంట్‌కు ఇవ్వనున్నారు. ఈ రెంటల్‌ సంస్థ ప్రపంచంలోని 11 సెలబ్రిటీల ఇళ్లను రెంట్‌కు అందిస్తుంది. వాటిల్లో ఒకటి శ్రీదేవి ఇల్లు కావడం విశేషం. అయితే శ్రీదేవి భవనంలో కేవలం ఇద్దరు గెస్టులు ఉండటానికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఒక బెడ్‌రూమ్‌, ఒక బాత్రూమ్‌ యాక్సెస్‌ మాత్రమే లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే మే 12 నుంచి బుకింగ్ చేసుకోండి.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

3 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.