Sobhitha : వైజాగ్ బ్యూటీ అయిన శోభిత ధూళిపాళ్ల ఇండస్ట్రీలో అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తోంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ మాత్రం బాగానే కలిసివస్తున్నాయి. శోభిత తాజాగా నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటించాడు. ఇక ఈ మూవీలో శోభిత వేశ్య క్యారెక్టర్ చేసింది.
సమంతతో డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి నాగ చైతన్యపైన అనేక రూమర్లు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. శోభితతో , నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నాడని ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. లండన్ లోని ఓ రెస్టారెంట్ లో వీరిద్దరూ కలిసి కనిపించినప్పటి నుంచి రూమర్స్ బాగా వ్యాపించాయి. ఇక చాలా కాలంగా వీళ్ళు రిలేషన్ లో ఉన్నారని,కలిసి వెకేషన్స్ కి వెళ్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి తోడు వీరిద్దరూ పెట్టే స్టేటస్ లు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాయి. అయితే ఈ న్యూస్ పై నాగ చైతన్య, శోభిత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ క్రమంలో శోభిత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోస్టులు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాయి.
రీసెంట్ గా శోభిత ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్ అంటూ ఛాయ్ తాగుతున్న ఓ మహిళ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది శోభిత. నేనందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అని దాని అర్థం. ఇక ఇందులో ఆమె chai అని రాయడంతో అది టీ గురించా లేక చైతన్య గురించా అంటూ పరోక్షంగా నెటిజన్స్ అనే డౌట్స్ ను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట్లో ఒక పాపను ఎత్తుకున్న శోభిత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో పాటు “బుజ్జి బంగారం” అంటూ పోస్ట్ షేర్ చేసింది శోభిత. అలాగే తార మీట్స్ తార అని రాసింది. ఇది కూడా నాగ చైతన్యను ఉద్దేశించే పోస్ట్ చేసిందా అని నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.