Sreeleela: శ్రీలీలలో ఆ ఒక్కటే ప్లస్ పాయింట్..అందుకే ఇన్ని అవకాశాలు

Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల చేతిలో మరే హీరోయిన్ కి లేనన్ని అవకాశాలున్నాయి. ‘పెళ్లి సందD’ చూసిన తర్వాత అంతగా క్లిక్ అవదనే కామెంట్స్ వినిపించాయి. కానీ, రవితేజ సరసన చేసిన ‘ధమాకా’ హిట్ తర్వాత అనుకోకుండా శ్రీలీలకి వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. రవితేజ లాంటి సీనియర్ హీరోతో సినిమా చేస్తుందంటే ఇక శ్రీలీల సర్దుకోవాల్సిందే..అంటూ కామెంట్స్ వినిపించాయి.

కానీ, అదే సినిమాతో ఎగసిపడుతుంది. ‘స్కంద’, ‘భగవంత్ కేసరి’, ‘ఎక్స్ట్రా’, ‘ఆదికేశవ’..ఇలా వరుసగా శ్రీలీల నటించిన సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో భగవంత్ ఒక్కటే సూపర్ హిట్. అది కూడా బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇన్ని ఫ్లాపులొస్తున్న హీరోయిన్ ని సాధారణంగా అయితే, మన టాలీవుడ్ మేకర్స్ ఎప్పుడో మెల్లగా పక్కన పెట్టేవారు. కానీ, ఇప్పుడున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న పెద్ద అందగత్తే కాకపోయినా సక్సెస్ ల వల్ల నెట్టుకొస్తుంది.

sreeleela-That’s the only plus point..that’s why there are so many opportunities

Sreeleela: డాన్స్ పరంగా బాగా మెస్మరైజ్ చేస్తుంది.

కృతీశెట్టి ఫ్లాపుల్లో కూరుకుపోయి ఆశించిన అవకాశాలు దక్కించుకోవడం లేదు. మిగతా హీరోయిన్స్ పరిస్థితీ ఏదో అంతంత మాత్రమే. పైగా వీరిలో డాన్స్ పరంగా చూస్తే మాస్ ఆడియన్స్ అంతగా ఆకట్టుకుంటున్నవారు లేరు. సాయి పల్లవి, తమన్నా తప్ప ఊరమాస్ డాన్స్ తో అలరిస్తున్నవారు లేరనే చెప్పాలి. అదే వరుస ఫ్లాపులొస్తున్నా శ్రీలీలకి ప్లస్ అవుతోంది. తను నటిస్తున్న సినిమాలలో డాన్స్ పరంగా బాగా మెస్మరైజ్ చేస్తుంది.

మొదటి సినిమా ‘పెళ్లి సందD’ ఆ తర్వాత ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’, ‘ఆదికేశవ’ సినిమాలలో సాంగ్స్ కొన్ని అదిరిపోయాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కుర్చీ మతడతపెట్టి’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో శ్రీలీల స్టెప్స్ చూస్తే కుర్రాళ్ళు ఊగిపోతున్నారు. మహేశ్, శ్రీలీల ఈ సాంగ్ కి వేసిన స్టెప్పులు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని ప్రోమో సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడందరూ ఈ సాంగ్ ఫుల్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ‘కుర్చీ మడతపెట్టీ’ సాంగ్ రిలీజ్ కానుంది. కాగా, 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘గుంటూరు కారం’.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.