Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ మూడ్ లోకి వచ్చేసారు. తన ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేందుకు ఫారెన్ కంట్రీస్ కి చెక్కేసారు. లేటెస్ట్ గా ఎయిర్ ఫోర్టులో ఫ్యామిలీ మొత్తం కనిపించడంతో ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ ఈవెంట్ కోసమే ఫ్యామిలీ మొత్తం కలిసి దుబాయ్ వెళుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి గిఫ్ట్ గా ఈ మూవీ విడుదల అయ్యేందుకు రెడీ అయింది. ఎప్పుడు ఎప్పుడు గుంటూరు కారం రిలీజ్ అవుతుందా అంటూ తన ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ మూవీ నుంచి రెండు పాటలను వదిలారు ఆ పాటలు రెండు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా మూవీపై పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ ప్రతి సంవత్సరం లాగే న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ ఏడు దుబాయ్ వెళుతున్నాడు. తన ఫ్యామిలీతో సహా ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. తాజాగా మహేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎయిర్ పోస్ట్ లో మహేష్ బాబు ఆయన కూతురు సితార హైలెట్గా నిలిచారు. సితార చేయి పట్టుకుని మహేష్ నడుస్తుండగా.. ఆ పక్కనే నమ్రత, గౌతమ్ నడిచారు. ఎయిర్ పోర్ట్ లో తీసిన వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మహేష్ ఫ్యామిలీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు న్యూయార్క్వెళ్తున్నట్లు టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వీరంతా దుబాయ్ వెళ్లినట్లు సమాచారం . దుబాయ్‍లో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లారని. అక్కడే న్యూయర్ కి వెల్కమ్ చెబుతారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మహేష్ గుంటూరు కారం మూవీ సంక్రాంతి రోజు విడుదల అవుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించునున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు కారం టీం ఫ్యాన్స్ కు ఉర్రూతలూగించే అప్డేట్ ఇచ్చింది.’కుర్చి మడత పెట్టి’ అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు, శ్రీలీల ఊర మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపేశారు.ఈ పాట ఫుల్ వెర్షన్ ను న్యూ ఇయర్ సందర్భంగా రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.