Thu. Jan 22nd, 2026

    Sreeleela: కమిట్‌మెంట్ విషయంలో ముందే చెప్పాలి..కండీషన్స్ అప్లై..! అంటుంది కుర్రభామ శ్రీలీల. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా కాసేపు తన ఇన్స్టాగ్రాంలో చాట్ చేసింది శ్రీలీల. ఈ సమయంలో ఓ తుంటరి నెటిజన్ అడిగిన ప్రశ్నకి అస్సలు కంగారు పడకుండా షాకిచ్చేలా వాడికి సమాధానమిచ్చింది.

    శ్రీలీలని నెటిజన్ “ఆర్ యూ కమిటెడ్” అని అడిగాడు. దానికి సమాధానంగా “ఎస్ వర్క్ విషయంలో నేను చాలా కమిటెడ్‌గా ఉంటాను” అని చెప్పింది. ఇందులో కమిటెడ్ అనే మాట గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి ఈ పదం వాడతారు. అది దృష్టిలో పెట్టుకునే నెటిజన్ శ్రీలీలను ఆ విధంగా అడిగాడు. అయితే, ఇప్పుడు ఇంకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

    sreeleela- In terms of commitment, it should be said beforehand..Conditions apply..!
    sreeleela- In terms of commitment, it should be said beforehand..Conditions apply..!

    Sreeleela: కమిటయ్యే ముందు నిర్మాతలకి కొన్ని కండీషన్స్

    శ్రీలీల సినిమాకి కమిటయ్యే ముందు నిర్మాతలకి కొన్ని కండీషన్స్ పెడుతుందట. ‘పెళ్లి సందD’, ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలలో క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అందరు తన చుట్టే తిరుగుతున్నారు. త్వరలో ‘ఆదికేశవ’, ‘ఎక్స్ట్రార్డినరీ మేన్’ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మహేశ్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని కమిటయింది.

    అయితే, కొత్త ప్రాజెక్ట్ కమిటయ్యే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఖచ్చితంగా ఇచ్చిన డేట్స్‌లో తన పార్ట్ షూట్ కంప్లీట్ అవ్వాలని నిర్మాతలకి కండీషన్ పెడుతుందట శ్రీలీల. ఎందుకంటే ఒక్క సినిమా డేట్స్ గనక మిస్ అయితే ఆ ప్రభావం మిగతా వాటిపై పడుతుంది కాబట్టి. ఎక్స్ట్రా డేట్స్ సర్దుబాటు చేయలేలనీ నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. తనవల్ల మిగతావాళ్ళు అసలు ఇబ్బంది పడకూడదని శ్రీలీల అభిప్రాయం. అందుకే, డేట్స్ విషయంలో పక్కాగా ఉంటుందట. అదీ అసలు విషయం. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కోటిన్నర వరకూ డిమాండ్ చేస్తుందని సమాచారం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.