Sravanamasam: హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే మాసాలలో శ్రావణమాసం ఒకటి. శ్రావణమాసంలో మహిళలందరూ పెద్ద ఎత్తున అమ్మవారిని పూజిస్తూ ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగిస్తుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తుంటారు అందుకే పెద్ద ఎత్తున వ్రతాలు చేసి వాయినాలు ఇవ్వడం వల్ల అంతా శుభమే కలుగుతుందని భావిస్తారు. ఇలా శ్రావణ మాసంలో మహిళలందరూ కూడా ఎంతో బిజీగా పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఉంటారు.
ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసంలో కొన్ని మంచి పనులు చేయడం వల్ల శుభం కలుగుతుందని చెబుతారు. అయితే దానధర్మాలకు మించిన మంచి పని ఏదీ లేదని చెప్పాలి. దానధర్మాలు చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణమాసంలో కొన్ని వస్తువులను ఏమాత్రం దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు.మరి శ్రావణ మాసంలో ఎలాంటి వస్తువులను దానం చేయకూడదు అనే విషయానికి వస్తే…
Sravanamasam:
శ్రావణ మాసంలో పొరపాటున కూడా మనం ఇతరులకు చీపురు, ఉప్పు, కారం వంటి వాటిని అసలు దానం చేయకూడదు. ఈ వస్తువులను కనుక మనం శ్రావణమాసంలో దానం చేసాము అంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో మనం ఏమి దానం చేసిన ఇతరుల ఆకలి తీర్చడానికి వస్తు రూపంలో దానం చేయాలి కానీ ధనం ఎప్పుడు కూడా దానం చేయకూడదు. అందుకే శ్రావణ మాసంలో ధన రూపంలో దానధర్మాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.