Mangala Gouri Vratham: శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసం అని భావిస్తారు ఈ నెలలో ఎన్నో రకాల పూజలు వ్రతాలు నోములు చేస్తూ మహిళలందరూ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ధోరణిలోనే ఉంటారు. ఇక శ్రావణ సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు నిర్వహిస్తారు. ఇక మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తూ తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని పార్వతి దేవిని కోరుకుంటారు. ఇక శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలు కలగాలని వేడుకుంటారు. ఈ విధంగా ఈ నెల మొత్తం ఎన్నో రకాల పూజలు వ్రతాలకు కీలకమైన మాసం అని చెప్పాలి.
ఇకపోతే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు అయితే పెళ్లి అయిన మహిళలు మాత్రమే కాకుండా పెళ్లి కాని వారు కూడా ఈ మంగళ గౌరీ వ్రతం జరుపుకోవచ్చు. పెళ్లయిన స్త్రీలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుతూ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ముత్తైదువులకు తాంబూలాలు పంచుతూ ఉంటారు. ఇక పెళ్లి ఆలస్యం అవుతున్నటువంటి వారు కూడా మంగళ గౌరీ వ్రతం చేయటం వల్ల కోరుకున్న వరుడు దక్కుతాడని పండితులు చెబుతున్నారు.
వివాహమైన స్త్రీలు అలాగే పెళ్లి ఆలస్యం అవుతున్న వారు మంగళవారం ఉదయమే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసే పార్వతీదేవిని పూజించాలి. అమ్మవారిని పూజించే సమయంలో ఎరుపు రంగు పువ్వులు, మహిళ అలంకరణ వస్తువులను సమర్పించండి. దీనితో పాటు శివునికి ఉమ్మెత్త, బిల్వ పత్రాలు, గంధం, గంగాజలం, పాలు మొదలైన వాటిని సమర్పించే భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. వివాహం కావాలనుకునే మహిళలు ఈ మంత్రం చదువుకోవడం మంచిది.
ఓం హ్రీం యోగినీ యోగినీ యోగేశ్వరి యోగ భయంకరీ మమ వాసం ఆకర్ష ఆకర్షాయ నమః
ఓం పార్వతీ పత్యే నమః ఓం పార్వతీ పత్యే నమః అనే మంత్రాన్ని చదవాలి ఇక పూజ చేసే సమయంలో ఎంతో పరిశుభ్రతను పాటించడం మంచిది. పూజలో అమ్మవారికి కుంకుమ, అక్షతం, పసుపు, తేనె మొదలైన వాటిని సమర్పించండి. పూజ సమయంలో ఓం మంగళాయ నమః మంత్రాన్ని కూడా జపించండి. చివరికి హారతి ఇచ్చే సమయంలో మంగళ గౌరీ దేవి కథను కూడా . ఇలా వ్రత కథ వినడం ద్వారా ఉపవాసానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.