Sravana Masam: మన హిందూ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏడాదికి 12 నెలలనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈ 12 నెలలు కూడా ఒక్కో నెలకు ఒక్కో ప్రత్యేకత ఉందని చెప్పాలి. త్వరలోనే శ్రావణమాసం రాబోతుంది శ్రావణమాసం అంటే మహిళలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ఇక ఈ నెల మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు ఇలా ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణమాసం ఈ ఏడాది ఎప్పుడు వస్తుంది? ఈ శ్రావణ మాసంలోకి ఏ ఏ పండుగలు ఎప్పుడు వస్తాయి అనే విషయానికి వస్తే..
ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమవుతుంది. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజిస్తారు. అదేవిధంగా మంగళ గౌరీ వ్రతంతో పాటు వరలక్ష్మి వ్రతాన్ని కూడా శ్రావణ మాసంలోనే జరుపుకుంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఇలా వరలక్ష్మీ వ్రతాన్ని పెళ్లైన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
ఈ వ్రతాలతో పాటు నాగ పంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శని త్రయోదశి, కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి వంటివి ఈ మాసంలో ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణమాసంలో ఐదు శ్రావణ సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ఇక ఈ శ్రావణమాసం మొత్తం చాలామంది మాంసాహార పదార్థాలను కూడా తినకుండా ఎంతో నియమ నిష్టలతో పూజలను నిర్వహిస్తూ ఉంటారు.