Dreams: సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ కలలు తెల్లవారుజామున రాగ మరికొన్నిసార్లు పగలు నిద్రపోయిన సమయంలో కూడా కలలు వస్తుంటాయి. ఇలా తరచూ కలలలో ఎన్నో రకాల జంతువులు, మొక్కలు బంధువులు దేవుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి గుర్రాలు కూడా కలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా గుర్రాలు కనిపించడం మంచిదేనా ఇది దేనికి సంకేతం అనే విషయంపై చాలామంది ఆలోచనలు చేస్తూ ఉంటారు..
గుర్రం కలలో కనపడితే కనుక చాలా మంచిదని భావిస్తారు. ఇది వ్యక్తి జీవితంలో సంపదను పొందుతారని సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తి గౌరవం, కీర్తిని పెంచుతుందని విశ్వాసం.కలలో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే.. లేదా స్వారీ చేస్తున్న గుర్రం కనిపిస్తే ఈ కలకు అర్ధం మీ పనిలో విజయం సాధించబోతున్నారని అర్థం. అలా కాకుండాకలలో రెక్కలు గుర్రం కనిపించినా.. గుర్రం ఎగురుతున్నట్లు చూసినట్లయితే.. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని.. శుభకార్యాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థం.
ఇక కొన్నిసార్లు మనకు కలలో అనారోగ్యానికి గురైన గుర్రం కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా గాయపడిన గుర్రం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి గుర్రం కనుక కనపడితే మీరు మీ జీవితంలో చేయబోయే పనుల విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పే సంకేతం అంటూ స్వప్న శాస్త్రం చెబుతోంది.