Solar Panels: ప్రస్తుత కాలంలో విద్యుత్ చార్జీలు అధికంగా పెరిగిపోవటం వల్ల చాలా మంది సోలార్ ప్యానల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పలు కంపెనీలు రైతుల వద్ద భూములను తీసుకొని పెద్ద ఎత్తున పొలాలలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా సోలార్ ప్యానల్స్ కోసం సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా సౌర శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఈ సోలార్ ప్యానల్స్ వల్ల క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారంటే…
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలీనా శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. అయితే ఈ పరిశోధనలలో ఎక్కడ కూడా సోలార్ ప్యానల్స్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందన్న ఆధారాలు గుర్తించలేదు. అయితే సోలార్ ప్యానల్స్ నుంచి వెలువడే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది.దీనివల్ల సమీప ప్రాంతంలో నివసించే వారికి దృష్టిలోపం తీవ్రమైన తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కానీ క్యాన్సర్ వస్తుందని దానికి సరైన ఆధారాలు మాత్రం లభించలేదని తెలిపారు.
Solar Panels:
ఇలా సోలార్ ప్యానల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అందుకే ఏ మాత్రం సంతోషం వ్యక్తం చేయకుండా సోలార్ ప్యానల్స్ ఉపయోగించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ సోలార్ ప్యానల్స్ వల్ల సూర్యుడి నుంచి వెలువడే సౌర కిరణాల నుంచి వచ్చే రేడియేషన్ ఇవి గ్రహించి వాటిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. అయితే వీటి వల్ల ఏ విధమైనటువంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు లేవని నిపుణులు చెబుతున్నారు.