Hair Fall: అమ్మాయిలు అందంగా కనిపించాలి అంటే చర్మ సౌందర్యం మాత్రమే కాకుండా జుట్టు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది జుట్టు బాగా ఒత్తుగా ఉంటేనే వారి అందం రెట్టింపు అవుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు పొల్యూషన్ కారణంగా చాలామందిలో జుట్టు రాలే సమస్య అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ సమస్య వల్ల చాలా మంది ఎంతో కృంగిపోతుంటారు మరి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలి అంటే ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఇక ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఈ చిన్న చిట్కాతో ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
అధికంగా జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి ఒక టేబుల్ స్పూన్ తేనె వేయాలి ఇలా వేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్కాల్ఫ్ అలాగే జుట్టు మొత్తం రాసి గంటపాటు ఆరనివ్వాలి అనంతరం మైల్డ్ షాంపుతో స్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేయటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోవడమే కాకుండా కొత్త జుట్టు రావడానికి కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక తేనె అలోవెరాలో ఉండేటటువంటి ప్రోటీన్లు విటమిన్లు జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేటమే కాకుండా జుట్టుకు మంచి పోషణ అందిస్తూ ఆరోగ్యవంతమైనటువంటి జుట్టు ఎదగదలకు దోహదపడుతుంది. కనుక ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ సింపుల్ చిట్కాని ఫాలో అవుతే జుట్టు రాలిపోవడం ఆగడంతో పాటు ఒత్తుగా పెరగడం మొదలవుతుంది అలాగే ఈ చిట్కాలు పాటించడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.