Smart Phones: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరి చేతిలోనూ మనకు స్మార్ట్ ఫోన్ కనబడుతుంది.ఒక్క పూట అన్నం లేకుండా అయినా ఉంటారేమో కానీ ఒక్క నిమిషం సెల్ఫోన్ చేతిలో లేకపోతే అసలు ఏమాత్రం దిక్కు తోచదు. ఇలా ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారనే చెప్పాలి కనీసం ఫోన్ లేకపోతే ముద్ద కూడా తినని పరిస్థితికి పిల్లలు వచ్చారు.
ఈ విధంగా పిల్లలు మొబైల్ ఫోన్లకు అంకితం అయ్యారు అంటే అది కేవలం పెద్దలు చేసిన పొరపాటు అని చెప్పాలి.వారిని పిల్లలు విసిగించకుండా ఉండటం కోసం మొబైల్ ఫోన్ వారి చేతిలో పెట్టి పెద్దలు వారి పనులను చూసుకుంటున్నారు. దీంతో పిల్లలు మొబైల్ ఫోన్లకు అంకితం అవుతున్నారు. ఇలా ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి పిల్లలు వచ్చేసారు. ఇలా పిల్లలు తరచూ ఫోన్లో సమయం గడుపుతున్నారు అంటే వాళ్లు వర్చువల్ ఆటిజం బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నాలుగు , ఐదు ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలలో కనిపించే పరిస్థితి వర్చువల్ ఆటిజం అంటారు.
Smart Phones:
మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ లను ఎక్కువగా వాడటం వల్ల పిల్లలకు ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అది ఒక్క సమస్యే కాకుండా మానసిక ఆరోగ్యం, కంటి చూపు పై కూడా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆటిజం వ్యాధి కలిగిన పిల్లలు దూకుడు ప్రవర్తన కలిగి ఉంటారు. మొబైల్ ఫోన్‌లో అరగంట తర్వాత కూడా అశాంతికి గురవుతారు. ఏకాగ్రత,. నిద్రలేమి సమస్యలు వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ థెరపీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ థెరపీ ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు.