Sleep At Night: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పని ఒత్తిడి కారణంగా అలాగే ఇతరత వ్యవహారాల వల్ల రాత్రిపూట చాలా ఆలస్యంగా పడుకుంటూ వుంటారు. అయితే చాలామంది రాత్రి పడుకోవడానికి ముందు మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉండటం వల్ల నిద్ర పోవడానికి సమయం కూడా లేకుండా పోతుంది. ఇలా మొబైల్ ఫోన్ కి అంకితం కావడంతో చాలామంది రాత్రిపూట సరైన నిద్ర నిద్ర పోవడం లేదు ఇలా రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయం మనకు తెలిసిందే.
ఇక చాలామంది ఇంత నిద్రపోవాలని ప్రయత్నం చేసినా కూడా రాత్రిపూట వారికి సరిగా నిద్ర పట్టదు ఇలా రాత్రిపూట నిద్ర రాలేదు అంటే అందుకు కారణం మన శరీరంలో విటమిన్ లోపమే కారణమని చెప్పాలి.మంచి నిద్ర కోసం మెలటోనిన్ హార్మోన్ సరిపడంత ఉండాలి. శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తికి విటమిన్ -డి ప్రధాన వనరు. శరరంలో విటమిన్-డి లోపించినప్పుడు నిద్ర హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
నిద్రలేమి సమస్య రావడానికి కారణం విటమిన్ టి మాత్రమే కాకుండా మరికొన్ని కారణాలు కూడా కారణమవుతూ ఉంటాయి. శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగితే శరీరం ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఈ కారణంగా నిద్రపట్టదు. నిద్రలేమి సమస్యను అధిగమించడానికి విటమిన్- డి అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం సూర్యరశ్మిలో కొద్దిసేపు తిరగాలి. పుట్టగొడుగులు, గుడ్లు, సోయా మిల్క్, బాదం మిల్క్, నారింజ రసం, సముద్రపు ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా విటమిన్ డి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడమే కాకుండా వ్యాయామం యోగ వంటివి చేయటం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.