Silver Lamps:సాధారణంగా మన ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి ముందు దీపారాధన చేస్తుంటాము అయితే దీపారాధన చేసే సమయంలో మన ఇంట్లో ఇత్తడి లేదా కంచు ఇక మట్టి ప్రమిదలలో కూడా దీపారాధన చేస్తూ ఉండటం మనం చూస్తుంటాము. అయితే చాలా ఆర్థికంగా ఉన్నవారు వెండి ప్రమిదలలో దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా మన ఆర్థిక స్తోమతను బట్టి మనం స్వామివారి ముందు వివిధ రకాల ప్రమిదలలో దీపారాధన చేస్తుంటాము అయితే వెండి ప్రమిదలలో ఏ దేవుడి ముందు దీపం వెలిగించి దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…
ఆదిదేవుడు అయినటువంటి వినాయకుడి ముందు వెండి దీపాలను వెలిగించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అయితే నెయ్యితో దీపారాధన చేయాలి. ఇక సరస్వతి అమ్మవారి ముందు వెండి ప్రమిదలలో నెయ్యి వేసి దీపారాధన చేయటం వల్ల అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. లక్ష్మీదేవి చిత్రపటం ముందు వెండి కుందిలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక చంద్రుడికి వెండి కుందిలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల మనలో స్థిరత్వం కలుగుతుంది.
Silver Lamps:
ఇక శనివారం వెండి ప్రమిదలలో నవగ్రహాలకు కనుక దీపారాధన చేయటం వల్ల గ్రహ దోషాలు మొత్తం తొలగిపోతాయి.ఇలా ఒక్కో దేవుడు ముందు వెండి ప్రమిదలను వెలిగించడం వల్ల ఒక్కో విధమైనటువంటి ఫలితం కలుగుతుంది.అయితే తప్పనిసరిగా వెండి దీపాలలోనే పూజ చేయాలన్న నియమం ఏమాత్రం లేదు. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు స్వామి వారి దేవుడి ముందు ఇత్తడి కంచు లేదా మట్టి ప్రమిదలను కూడా వెలిగించి పూజిస్తూ ఉంటారు.