Sivarathri: సాధారణంగా మహాశివరాత్రి పండుగను ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున భక్తులందరూ శివాలయానికి వెళ్లి స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయించి స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం ఉపవాసాలు జాగరణలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా శివరాత్రి పండుగ రోజు చాలామంది ఉపవాసం జాగరణ ఉంటూ ఆ పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు మరుసటి రోజు ఉదయం తలంటు చన్నీటి స్నానం చేసి మరోసారి శివుడికి పూజ చేసిన అనంతరం ఉపవాసాన్ని వదిలేస్తూ ఉంటారు.
ఇలా శివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఉపవాస జాగరణలను ఆచరిస్తూ ఉంటారు. అయితే స్వామివారికి పూజ చేసే ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉంటూ చేతికి దొరికిన వాటిని అసలు తినకూడదు నియమనిష్టలతో ఉపవాస దీక్షలను ఆచరించాలి కేవలం పండ్లు పండ్ల రసాలు వంటి వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇక స్వామివారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం మాత్రం తీసుకోవచ్చు కానీ ఉపవాసం అంటూనే ఇతర పదార్థాలను తినకూడదు.
ఉపవాసం చేసేవారు శివుడి ఆరాధనలో ఉంటూనే శివ చాలీసా చదువుతూ భక్తితో ఉండాలి అంతేకాకుండా ఉపవాసం చేసే సమయంలో ఇతరులపై దుర్భాషలాడకూడదు. ఇక శివరాత్రి పండుగ రోజు చాలామంది జాగరణలు చేస్తూ ఉంటారు ఇలా జాగరణ చేసేవారు మేలుకోవాలి కదా అని సినిమా పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తూ అసలు మేలుకోకూడదు స్వామివారి ఆలయంలో ఉండి భక్తి పాటలతోను భజనలను చేస్తూ శివుడిని ఆరాధిస్తూ జాగరణ చేయాలి ఇలా చేసినప్పుడే మోక్షం లభిస్తుంది.