Thu. Jan 22nd, 2026

    Sankranthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం ఇంటిముందు నీళ్లు చల్లి ముక్కు వేసుకోవడం జరుగుతుంది  ఇలా ముగ్గు వేయటం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం ఇంటిముందు ముగ్గు వేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు ప్రత్యేకగా వేస్తారని చెప్పాలి.

    significance-and-importance-muggu-rangoli-sankranti-festival
    significance-and-importance-muggu-rangoli-sankranti-festival

    ఇలా సంక్రాంతి పండుగ రోజు ఎన్నో రకాల ముగ్గులను వేసి రంగులు వేస్తూ ఆ ముగ్గుపై గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు ఇలా సంక్రాంతి పండుగకు మాత్రమే గొబ్బెమ్మలను తయారు చేసి పెట్టడం ఇలా రంగువల్లులను వేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్‌ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది.

    ఇక రంగువల్లులను వేసి గొబ్బెమ్మలను కూడా పెడుతుంటాము సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ రైతులకు పంట మొత్తం చేతికి వస్తుంది ఇలా నవధాన్యాలను కలిపి గొబ్బెమ్మలను సాక్షాత్తు గౌరీ దేవిగా భావించి వాటిలో వేసి పూజించడం వల్ల గౌరీ దేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని అలాగే నవధాన్యాలను గొబ్బెమ్మలలో వేసి పూజించడం వల్ల ధాన్యలక్ష్మి ఆశీస్సులు కూడా మనపై ఉంటాయని భావిస్తూ గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తూ ఉంటారు.