Break Fast: సాధారణంగా చాలామంది శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల శరీర బరువు తగ్గుతారని చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినరు అయితే ఇలా ఉదయం మనం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కంటే కూడా అనారోగ్య ప్రయోజనాలే అధికంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి అనే విషయానికి వస్తే..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కనుక చేయకపోతే ఊబకాయం పెరుగుతుంది. దీనికి కారణం మధ్యాహ్న భోజనంలో అతిగా తినడం, దీని కారణంగా వ్యక్తి బరువు పెరుగుతాడు.డయాబెటిస్‌కు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్పింగ్ కారణాల వల్ల అల్పాహారం తీసుకోని వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం కూడా చాలా రెట్లు పెరుగుతుంది. వీరికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇక మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పూర్తిస్థాయిలో తగ్గిపోతుంది. ఎప్పుడైతే అల్పాహారం తినడం మానేస్తామో ఆ సమయంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ మనల్ని అనేక అనారోగ్య సమస్యలకు గురి అయ్యేలా చేస్తుంది.ఇది శరీరంలోని వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాడలేకపోతుంది. ఈ పరిస్థితిలో వ్యక్తులు తీవ్రమైన వ్యాధులకు గురవుతారు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడం చాలా అవసరం.