Lemon water: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై దృష్టి సారించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఎన్నో పాటిస్తూ ఉంటారు. అయితే చాలామంది శరీర బరువు తగ్గడానికి అలాగే మన ప్రేగులు మొత్తం శుభ్రం కావడానికి ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం కలుపుకొని కాస్త తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది అలాగే చాలామంది నిమ్మరసం కలిపిన నీటిని తాగడానికి ఇష్టం చూపుతూ ఉంటారు అయితే ఇలా నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగటం అనారోగ్యాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగడం వల్ల వ్యాధులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి నిమ్మరసం ఎవరు తాగకూడదనే విషయానికి వస్తే.. ప్రస్తుత కాలంలో చాలామంది బాధపడుతున్నటువంటి సమస్యలలో గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. ఇలా గ్యాస్ సమస్యతో బాధపడేవారు నిమ్మరసం కలిపిన నీటిని పొరపాటున కూడా తాగు కూడదు తాగటం వల్ల గ్యాస్ తీవ్రత మరింత అధికమవుతుంది.
ఎవరైతే దంత క్షయ సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారు, అల్సర్ ఉన్నవారు, నోట్లో పుండ్లు సమస్యతో బాధపడేవారు, రక్తాన్ని పలుచ పరచడం కోసం మందులు ఉపయోగిస్తున్న వారు అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు మందులను ఉపయోగిస్తున్న వారు నిమ్మరసం నీటిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.